Bus Overturns | కొండపై నుంచి లోయలో పడిన బస్సు.. 16 మంది మృతి
Bus Overturns | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉధంపూర్ (Udhampur) జిల్లాలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 10 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
Bus Overturns | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉధంపూర్ (Udhampur) జిల్లాలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 10 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్‌నగర్ నుంచి ఉధంపూర్ వెళ్తున్న బస్సు కానోట్ గ్రామం (Kanote) వద్దకు రాగానే మూలమలుపు వద్ద ప్రమాదానికి గురైంది. బస్సు అదుపుతప్పి కొండపై నుంచి కిందకు పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోగా.. 20 మంది వరకూ గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
#WATCH | Udhampur, Jammu and Kashmir: A bus met with an accident in the village Kanote, Udhampur.
10 people have died, and a rescue operation is underway. The injured have been shifted to the government hospital in Udhampur: J&K Police pic.twitter.com/iqEcoxg2F6
— ANI (@ANI) April 20, 2026
సీఎం ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి
ప్రమాద ఘటనపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నట్లు ఆయన చెప్పారు. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం విచారం వ్యక్తం చేశారు. ఇది హృదయ విదారకమైన ఘటన అని పేర్కొన్నారు. బాధితులకు అవసరమైన సాయాన్ని అందించాలని సంబంధిత అధికారులు, ఆరోగ్య శాఖను ఆయన ఆదేశించారు.
Also Read..
రద్దీ రహదారిపై నమాజ్ చేసిన వ్యక్తి.. అరెస్ట్ చేసిన పోలీసులు
సంబంధిత వార్తలు

Tricolour Ribbon | ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి మువ్వన్నెల రిబ్బన్.. కట్‌చేసేది లేదన్న సీఎం..
ఏప్రిల్ 16, 2026

Charity Scam | ఇరాన్ వార్ పేరుతో భారీ స్కామ్.. ఛారిటీ ముసుగులో దేశవ్యతిరేక శక్తుల కోసం నిధుల సేకరణ..!
మార్చి 26, 2026

Revanth Reddy | మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
మార్చి 26, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



