Air India | సాంకేతిక సమస్య.. 8 గంటలుగా గాల్లోనే ఎయిర్ ఇండియా విమానం..!
Air India | ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) విమానంలో సాంకేతిక సమస్య (technical issue) తలెత్తింది. దాదాపు 8 గంటల పాటూ గాల్లోనే ప్రయాణించిన ఆ విమానం చివరికి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
Air India | ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) విమానంలో సాంకేతిక సమస్య (technical issue) తలెత్తింది. దీంతో దాదాపు 8 గంటలపాటూ గాల్లో ప్రయాణించిన విమానం తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
230 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా బోయింగ్ 777-300 ER విమానం (Boeing 777-300 ER aircraft) బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరింది (San Francisco-Bound Flight). విమానం కొద్దిదూరం ప్రయాణించిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అనంతరం దాదాపు 8 గంటల పాటూ గాల్లోనే ప్రయాణించిన ఆ విమానం చివరికి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా కూడా ధృవీకరించింది. ఈ మేరకు ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తూ విమానంలో సాంకేతిక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు విమానయాన సంస్థ తెలిపింది. అప్పటి వరకూ ప్రయాణికులకు ఆహారం, వసతి, టికెట్ రీషెడ్యూలింగ్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత, శ్రేయస్సే తమకు అధిక ప్రాధాన్యమని సంస్థ స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Air India crash | తుదిదశలో అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు.. త్వరలోనే నివేదిక : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
జూన్ 15, 2026

Air india Plane Crash | విమాన ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్.. రూ.105 కోట్లతో పునర్నిర్మాణం
మే 27, 2026

Aviation Turbine Fuel | పెరిగిన ఇంధన భారం: మమ్మల్ని ఆదుకోండి.. లేదంటే విమానాలు బందే.. కేంద్రానికి ఎయిర్‌లైన్స్ సంస్థల విజ్ఞప్తి
ఏప్రిల్ 28, 2026
తాజావార్తలు
- ●KTR | అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్ అండ.. ధన్యవాదాలు తెలిపిన కుటుంబీకులు
- ●Rashmika Mandanna | దేవుడే ఇలా బ్రేక్ ఇచ్చాడు - గాయంపై రష్మిక మందన్న క్లారిటీ
- ●Rajinikanth Goud Photo Journalist | ఇంటర్నేషనల్ ఫోటో కంటెస్ట్‌లో సత్తా చాటిన తెలంగాణ.. నమస్తే తెలంగాణ ఫోటో జర్నలిస్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు!
- ●ఇంటి నంబర్ 13 తీసుకుంటే ప్రమాదమా? నిజం ఇదే!
- ●Adluri Lakshman Kumar | మేడిగడ్డను కూల్చి.. గోదావరిపై రాజకీయాలా?
- ●Bihar by elections | ఉప ఎన్నికల్లో బీజేపీకి కుదుపు.. 3 సీట్లలో రెండింట్లో ఓటమి

KTR | అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్ అండ.. ధన్యవాదాలు తెలిపిన కుటుంబీకులు

Rashmika Mandanna | దేవుడే ఇలా బ్రేక్ ఇచ్చాడు - గాయంపై రష్మిక మందన్న క్లారిటీ

Rajinikanth Goud Photo Journalist | ఇంటర్నేషనల్ ఫోటో కంటెస్ట్‌లో సత్తా చాటిన తెలంగాణ.. నమస్తే తెలంగాణ ఫోటో జర్నలిస్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు!

ఇంటి నంబర్ 13 తీసుకుంటే ప్రమాదమా? నిజం ఇదే!



