TECNO POP X 5G | భారీ బ్యాటరీ, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వచ్చిన టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే లాంచ్..
TECNO POP X 5G | మొబైల్స్ తయారీదారు టెక్నో తన నూతన స్మార్ట్ ఫోన్ పాప్ ఎక్స్ 5జి ని భారత మార్కెట్‌లో సోమవారం విడుదల చేసింది. ఈ ఫోన్‌లో బ్యాటరీ ఎక్కువ కాలం పాటు మన్నికగా పనిచేస్తుందని, బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగా ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
Technology | Published On Apr 20, 2026, 12.51 pm IST
TECNO POP X 5G | మొబైల్స్ తయారీదారు టెక్నో తన నూతన స్మార్ట్ ఫోన్ పాప్ ఎక్స్ 5జి ని భారత మార్కెట్‌లో సోమవారం విడుదల చేసింది. ఈ ఫోన్‌లో బ్యాటరీ ఎక్కువ కాలం పాటు మన్నికగా పనిచేస్తుందని, బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగా ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుండగా, దీని ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ఫోన్‌లో 6500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఇచ్చారు. ఇది 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. అందువల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది. ఈ ఫోన్ దృఢమైన బిల్డ్ క్వాలిటీని కలిగి ఉంది. అలాగే కేవలం 8.18 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. అందువల్ల ప్రీమియం లుక్ వచ్చింది.
డస్ట్, వాటర్ రెసిస్టెన్స్..
ఈ ఫోన్ కు ఐపీ64 ప్రొ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను ఇచ్చారు. ఇందులో పలు ఏఐ టూల్స్ ను కూడా అందించారు. ఆడియో, కమ్యూనికేషన్ పరంగా ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ అనే ఫీచర్ ఉంది. దీని వల్ల కాల్స్ మాట్లాడేటప్పుడు అవతలి వారి వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. యూజర్ వాయిస్‌ను కూడా అవతలి వారు స్పష్టంగా వింటారు. అలాగే ప్రొడక్టివిటీ కోసం ఏఐ రైటింగ్ అసిస్టెంట్, సర్కిల్ టు సెర్చ్ అనే ఏఐ ఫీచర్లను ఇచ్చారు. ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగంలో ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ ఇమేజ్ ఎక్స్‌టెండర్, ఏఐ ఫ్లాష్ స్నాప్ అనే టూల్స్‌ను ఇచ్చారు. ఈ ఫోన్‌లో 6.78 ఇంచుల డిస్‌ప్లే ఉండగా, దీనికి హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చారు. అందువల్ల డివైస్ డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఔట్ డోర్‌లో డిస్‌ప్లే స్పష్టమైన వీక్షణ కోసం 560 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చారు.
డెడికేటెడ్ మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్..
ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ఉంది. 4జీబీ, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. డ్యుయల్ సిమ్ స్లాట్లతోపాటు మైక్రో ఎస్‌డీ కార్డు కోసం ప్రత్యేకంగా డెడికేటెడ్ స్లాట్‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే హైఓఎస్ 16ను ఈ ఫోన్‌లో ఇచ్చారు. వెనుక వైపు 13 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 3.5ఎంఎం ఆడియో జాక్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్ సి వంటి కనెక్టివిటీ సదుపాయాలను ఇచ్చారు.
టెక్నో పాప్ ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999 ఉండగా, 6జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.17,999గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఏప్రిల్ 24 నుంచి విక్రయించనున్నారు.
సంబంధిత వార్తలు

TECNO CAMON 50 Ultra 5G | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నికతో వచ్చిన టెక్నో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
జులై 17, 2026

vivo T5 Lite 44W 5G | భారీ బ్యాటరీ, ఆకట్టుకునే ఏఐ ఫీచర్లతో లాంచ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
జులై 16, 2026

Telangana AWS Data Centre | అమెజాన్‌కు రూ.లక్ష కోట్ల టార్గెట్.. సీఎం రేవంత్ ‘ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్ ఇదే!
జులై 15, 2026
తాజావార్తలు
- ●Madhya Pradesh High Court | అందరికీ తెలిసేలా.. రిలేషన్ షిప్లో ఉన్నారు.. రేప్ కేసు కుదరదు
- ●Employees Health Scheme | 'ఈహెచ్ఎస్' పథకం ప్రారంభం.. ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్
- ●Women's Hockey WC | మహిళల హాకీ ప్రపంచకప్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా సలీమా టెటే
- ●CBDT | విదేశీ ఆస్తుల వివరాలు ఇక ఏఐఎస్‌లో.. ఐటీఆర్ ఫైలింగ్‌కు సీబీడీటీ కొత్త సౌకర్యం..
- ●FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ తొలిసారి విజేతలకు చాంపియన్‌షిప్ రింగ్స్..! అభిమానులకు కూడా..!
- ●TECNO CAMON 50 Ultra 5G | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నికతో వచ్చిన టెక్నో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..

Madhya Pradesh High Court | అందరికీ తెలిసేలా.. రిలేషన్ షిప్లో ఉన్నారు.. రేప్ కేసు కుదరదు

Employees Health Scheme | 'ఈహెచ్ఎస్' పథకం ప్రారంభం.. ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్

Women's Hockey WC | మహిళల హాకీ ప్రపంచకప్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా సలీమా టెటే

CBDT | విదేశీ ఆస్తుల వివరాలు ఇక ఏఐఎస్‌లో.. ఐటీఆర్ ఫైలింగ్‌కు సీబీడీటీ కొత్త సౌకర్యం..



