త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air India | బెంగ‌ళూరు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక స‌మ‌స్య‌.. ముంబైలో ల్యాండ్‌

Air India | దేశీయ విమాన‌యాన సంస్థ ఎయిర్ ఇండియాను (Air India) సాంకేతిక స‌మ‌స్య‌లు వేధిస్తున్నాయి. విమానాలు త‌ర‌చూ టెక్నిక‌ల్ ఇష్యూతో (Technical Issue) ప్ర‌యాణికుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నాయి.

G

National | Published On Apr 10, 2026, 6.36 am IST

Air India | బెంగ‌ళూరు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక స‌మ‌స్య‌.. ముంబైలో ల్యాండ్‌
Advertisement

Air India | త్రినేత్ర‌.న్యూస్‌: దేశీయ విమాన‌యాన సంస్థ ఎయిర్ ఇండియాను (Air India) సాంకేతిక స‌మ‌స్య‌లు వేధిస్తున్నాయి. విమానాలు త‌ర‌చూ టెక్నిక‌ల్ ఇష్యూతో (Technical Issue) ప్ర‌యాణికుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నాయి. గురువారం రాత్రి ముంబై నుంచి బెంగ‌ళూరు వెళ్తున్న ఏఐ 2818 విమానం.. ముంబై ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అయింది. అయితే విమానం గాలిలో ఉండ‌గా సాంకేతిక త‌లెత్తింది.

గుర్తించిన పైల‌ట్‌.. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ముంబై ఏటీసీకి స‌మాచారం అందించారు. దీంతో ల్యాండింగ్‌కు అనుమ‌తి ఇచ్చింది. ఎలాంటి దుర్ఘ‌ట‌న జ‌రుగ‌క‌ముందే సుర‌క్షితంగా ఎయిర్‌పోర్టులో దిగింది. అనంత‌రం విమానాన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సాంకేతిక తనిఖీలు నిర్వ‌హించారు.

కాగా, విమానంలోని ప్ర‌యాణికుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేశామ‌ని ఎయిర్ ఇండియా ప్ర‌క‌టించింది. ప్ర‌త్యామ్నాయ విమానంలో వారిని గ‌మ్య‌స్థానాల‌కు చేర్చిన‌ట్లు వెల్ల‌డించింది. ప్ర‌యాణికుల భ‌ద్ర‌తే త‌మ‌కు మొద‌టి ప్రాధాన్య‌త అని తెలిపింది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement