IndiGo Plane Hit By Car | ఇండిగో విమానాన్ని ఢీ కొట్టిన కారు
IndiGo Plane Hit By Car | కోల్‌కతా ఎయిర్‌పోర్టు (Kolkata Airport)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ క్యాటరింగ్ వాహనం అదుపుతప్పి పార్క్ చేసిన ఇండిగో విమానాన్ని ఢీ కొట్టింది (IndiGo Plane Hit By Car).
IndiGo Plane Hit By Car | కోల్‌కతా ఎయిర్‌పోర్టు (Kolkata Airport)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ క్యాటరింగ్ వాహనం అదుపుతప్పి పార్క్ చేసిన ఇండిగో విమానాన్ని ఢీ కొట్టింది (IndiGo Plane Hit By Car). ఎయిర్‌పోర్టులోని పార్కింగ్ బే నంబర్ 51లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనం అదుపుతప్పి విమానం ఇంజిన్‌ను ఢీ కొట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో విమానానికి స్వల్ప నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఈ విమానం కోల్‌కతా నుంచి గువాహటికి వెళ్లాల్సి ఉంది. అయితే, ఊహించని ఈ ప్రమాదంతో ఆ విమానం స్థానంలో మరో విమానాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దెబ్బతిన్న విమానాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.
Also Read..
కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదు : మొజ్తాబా ఖమేనీ
యుద్ధం ఎఫెక్ట్.. ఫిబ్రవరి నుంచి 10 వేలకుపైగా విమానాలు రద్దు
అస్సాం, బెంగాల్‌లో ఎన్నికలు.. లక్నో వీధుల్లో పేరుకుపోయిన చెత్త
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ

Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం






