War Effect | యుద్ధం ఎఫెక్ట్.. ఫిబ్రవరి నుంచి 10 వేలకుపైగా విమానాలు రద్దు
War Effect | ఇరాన్, అమెరికా యుద్ధం (Iran America War) భారతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం (War Effect) చూపిస్తున్నది. గగనతల ఆంక్షలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు (West Asia conflict), నిర్వహణ వ్యయం పేరగడంతో (Operational Costs) అంతర్జాతీయ సర్వీసులను దేశీయ విమానాయన సంస్థలు (Indian Airlines) రద్దుచేస్తున్నాయి.
War Effect | త్రినేత్ర.న్యూస్: ఇరాన్, అమెరికా యుద్ధం (Iran America War) భారతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం (War Effect) చూపిస్తున్నది. గగనతల ఆంక్షలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు (West Asia conflict), నిర్వహణ వ్యయం పేరగడంతో (Operational Costs) అంతర్జాతీయ సర్వీసులను దేశీయ విమానాయన సంస్థలు (Indian Airlines) రద్దుచేస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు 10 వేలకు పైగా సర్వీసులను రద్దు చేసినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. సాధారణంగా పశ్చిమాసియా దేశాలకు భారత్ నుంచి రోజుకు 300 నుంచి 350 విమానాలు నడుస్తుంటాయి. అయితే యుద్ధం కారణంగా ప్రస్తుతం ఆ సంఖ్య 80 నుంచి 90కి పడిపోయింది.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. దీంతో ప్రతిగా పశ్చిమాసియాలోని అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, కువైట్, ఖతార్, బహ్రైన్, యూఏఈ దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. ఈ నేపథ్యంలో ఐరోపా, ఉత్తర అమెకా దేశాలకు వెళ్లే భారతీయ విమానాలు సుదూర మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తున్నది. ఇది భారంతో కూడుకోవంతో విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దుచేసుకుంటున్నాయి.
ఇక, సుదూర ప్రయాణాలతో పాటు పైలట్ల కొరతను అధిగమించేందుకు ‘ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్’ నిబంధనను డీజీసీఏ తాత్కాలికంగా సడలించి. విమాన కార్యాకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు పైలట్ల విధి నిర్వహణ సమయాన్ని పెంచినట్లు తెలిపింది. ఈనెల 30 వరకు ఇది అమల్లో ఉంటుందని, తర్వాత పరిస్థితిని బట్టి సమీక్షిస్తామని పేర్కొంది.
సంబంధిత వార్తలు

Volcanic Eruption | బద్దలైన అగ్నిపర్వతం.. నిలిచిన విమానాలు.. చిక్కుకుపోయిన 1.70లక్షల మంది ప్రయాణికులు
సెప్టెంబర్ 7, 2026

Windfall Tax | చమురు సంస్థలకు ఊరట.. విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గించిన కేంద్రం..!
మే 31, 2026

Kishan Reddy | పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. రాజకీయంగా వాడుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్: కిషన్ రెడ్డి
మే 15, 2026
తాజావార్తలు
- ●DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ

Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం



