త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kolkata Airport | కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్..

Kolkata Airport | కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో గురువారం కొద్దిసేపు కలకలం రేగింది. విమానాశ్రయ ప్రాంగణంలో పలు చోట్ల బాంబులు పెట్టిన‌ట్లుగా గుర్తుతెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు.

P

National | Published On Oct 8, 2026, 7.55 pm IST

Kolkata Airport | కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్..
Advertisement

Kolkata Airport | కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో గురువారం కొద్దిసేపు కలకలం రేగింది. విమానాశ్రయ ప్రాంగణంలో పలు చోట్ల బాంబులు పెట్టిన‌ట్లుగా గుర్తుతెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే విమానాశ్రయ భద్రతా బాధ్యతలు చూస్తున్న సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్టు ప్రాంగణం మొత్తం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని అధికారులు వెల్లడించారు.

మెయిల్‌పై దర్యాప్తు

ఇది తప్పుడు సమాచారం అయి ఉండొచ్చని భావించినప్పటికీ.. భద్రత విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అధికారులు తనిఖీలు చేపట్టారు. బెదిరింపు ఈమెయిల్‌ను ఎవరు పంపారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. మెయిల్ మూలాన్ని గుర్తించేందుకు సైబర్ నిపుణుల సహాయాన్ని కూడా అధికారులు తీసుకుంటున్నారు. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకే రోజు రెండు బాంబు బెదిరింపులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఓ విమానం టాయిలెట్‌లో లిప్‌స్టిక్‌తో రాసిన బెదిరింపు నోట్ లభించగా.. మరో విమానం టాయిలెట్‌లోనూ బాంబు ఉన్నట్లు పేర్కొంటూ నోట్ కనిపించింది. రెండు ఘటనలూ ఫేక్ బెదిరింపులుగా అధికారులు ధ్రువీక‌రించారు. అదే నెల‌లో బెంగాల్‌లోని పలు జిల్లాల్లో పోస్టాఫీసులు, వాటికి అనుబంధంగా ఉన్న పాస్‌పోర్టు కార్యాలయాలకు సైతం బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో కార్యాలయాలను ఖాళీ చేయించి తనిఖీలు నిర్వహించారు. అక్కడ కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు దొర‌క‌లేదు.

Advertisement
Advertisement