Sanitation Crisis | అస్సాం, బెంగాల్‌లో ఎన్నికలు.. లక్నో వీధుల్లో పేరుకుపోయిన చెత్త
Sanitation Crisis | ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో (Lucknow) ఎక్కడ చూసినా చెత్త కుప్పలు (Sanitation Crisis) దర్శనమిస్తున్నాయి. వీధులన్నీ కంపుకొడుతున్నాయి. పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో రోడ్లన్నీ వ్యర్థాలతో నిండిపోయాయి.
Sanitation Crisis | త్రినేత్ర.న్యూస్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో (Lucknow) ఎక్కడ చూసినా చెత్త కుప్పలు (Sanitation Crisis) దర్శనమిస్తున్నాయి. వీధులన్నీ కంపుకొడుతున్నాయి. పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో రోడ్లన్నీ వ్యర్థాలతో నిండిపోయాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలే (Assam, West Bengal Elections) లక్నోలో ఈ పరిస్థితి ఏర్పడటానికి కారణం. ఎలా అంటారా?.. అక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల్లో (Sanitation Workers) అత్యధికులు ఆయా రాష్ట్రాలకు చెందినవారు కావడమే. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో లక్నో మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంత గ్రామాలకు వెళ్లిపోయారు.
సాధారణంగా లక్నోలో సుమారు 1,430 వాహనాలు, 3,500 మంది కార్మికులు పారిశుధ్య పనుల్లో పాల్గొంటారు. అయితే ఎన్నికల నేపథ్యంలో నగరానికి చెందిన దాదాపు 10 వేల మంది కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీంతో పలు ప్రాంతాల్లో పారిశుధ్య సేవలకు అంతరాయం కలిగింది. గతంలో నిర్వహించిన ధృవీకరణ డ్రైవ్‌లో కార్డులు లేని కార్మికులను మున్సిపల్ అధికారులు విధుల్లో నుంచి తొలగించారు. దీంతో కార్మికల సంఖ్య 60 నుంచి 70 శాతానికి పడిపోయింది. తాజాగా ఎన్నికల కోసం పెద్ద సంఖ్యలో తరలివెళ్లడంతో మున్సిపాలిటీలో కార్మికుల కొరత ఏర్పడింది.
దీంతో అధికారులు ఉన్నవారితోనే డబుల్ షిఫ్టుల్లో పనులు చేయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చెత్తను తొలగించేందుకు రోజువారీ కూలీలను రూ.1,000 నుంచి రూ. 1,500 వరకు ఇచ్చిన పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం వెళ్లినవారిలో కార్మికుల్లో చాలామంది మున్సిపల్ కార్పొరేషన్‌లోనే పనిచేస్తున్నారు.
లక్నో సాధారణంగా ప్రతిరోజూ సుమారు 2,100 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తుంది, కానీ ఈ సంఖ్య గణనీయంగా పడిపోయిందని మేయర్ సుష్మా ఖర్క్‌వాల్ అన్నారు. దీంతో నగరంలో పారిశుధ్య నిర్వహణ క్షీణించిందని తెలిపారు. గతంలో నిర్వహించిన డ్రైవ్‌ల సమయంలో ఆధార్ కార్డులు లేని చాలా మంది బంగ్లాదేశీయులుగా గుర్తించామని, వారంతా వెళ్లిపోయారని చెప్పారు. మిగిలిన కార్మికులు అస్సాంకు చెందినవారని, వారు ఓటు వేయడానికి వెళ్లడంతో తాత్కాలిక కొరత ఏర్పడిందని తెలిపారు. అక్రమ వలసదారులపై డ్రైవ్‌లు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ

Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం






