Mojtaba Khamenei | కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదు : మొజ్తాబా ఖమేనీ
Mojtaba Khamenei | మధ్యప్రాచ్యంలో 39 రోజులుగా సాగుతున్న యుద్ధంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటూ కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం కుదిరింది.
International | Published On Apr 8, 2026, 9.51 am IST
Mojtaba Khamenei | మధ్యప్రాచ్యంలో 39 రోజులుగా సాగుతున్న యుద్ధంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటూ కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం కుదిరింది. దీంతో ఇరాన్‌పై (Iran) దాడిని తాత్కాలికంగా విరమించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదేసమయంలో తక్షణమే కాల్పులు నిలిపివేయాలని తన సైన్యానికి ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదని (Not End Of War) స్పష్టం చేశారు. తమ చేతులు ఇప్పటికీ ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని.. శత్రుదేశాలు ఏదైనా దురాక్రమణకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
కాగా, ఈ రాత్రి ఇరాన్‌కు కాలరాత్రే.. ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి కీలకమని, ఈ రాత్రితో ఇరాన్ నాగరికత అంతమవుతుందని బీరాలు పోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్ యుద్ధం విషయంలో వెనక్కి తగ్గారు. ఇరాన్‌పై (Iran) దాడిని తాత్కాలికంగా విరమించుకున్నట్లు ప్రకటించారు. హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) తెరిచేందుకు మరో రెండు వారాలు గడువు ఇచ్చారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదనను అంగీకరించిన ట్రంప్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తన ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు.
‘పాక్ ప్రధాని షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌తో మాట్లాడాను. ఇరాన్‌కు ఇచ్చిన గడువును రెండు వారాలపాటు పొడిగించాలని, దాడులను నిలిపివేయాలని కోరారు. హర్మూజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి రెండు వారాల గడువు ఇచ్చేందుకు, కాల్పుల విరమణకు (Ceasefire) అంగీకరించాను. ఇరుదేశాల వైపు నుంచి ఈ కాల్పుల విరమణ ఉంటుంది. ఇరాన్ పది సూత్రాలతో ఒక ప్రతిపాదనను పంపించింది. అవన్నీ సానుకూలంగానే ఉన్నాయి. దీంతో చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఆ దేశంతో శాశ్వత శాంతి ఒప్పందానికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి ఈ రెండు వారాల గడువు ఉపయోగపడుతుంది. ఈ దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి చేరువవ్వడం గౌరవంగా భావిస్తున్నా. 14 రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోకపోతే మళ్లీ దాడులు చేస్తాం’ అని ట్రంప్ అందులో రాసుకొచ్చారు. కాగా, తాజా కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సైతం అంగీకరించింది. ఇరాన్‌పై రెండు వారాల పాటు సైనిక చర్యను నిలిపివేయనుంది.
కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించిన నేపథ్యంలో అమెరికా-ఇరాన్ దేశాలు ప్రత్యక్ష చర్చలకు రావాలని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. ఈ చర్చల కోసం ఈనెల 10న ఇస్లామాబాద్‌కు రావాలని ఇరు దేశాల అధికారులకు సూచించారు.
Also Read..
యుద్ధానికి రెండువారాల బ్రేక్.. భారీగా పతనమైన క్రూడాయిల్ ధరలు..!
సర్కే చునర్ సాంగ్ వివాదం.. నోరా ఫతేహికి జాతీయ మహిళా కమిషన్ చివరి ఛాన్స్..!
అస్సాం, బెంగాల్‌లో ఎన్నికలు.. లక్నో వీధుల్లో పేరుకుపోయిన చెత్త
సంబంధిత వార్తలు

Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
సెప్టెంబర్ 22, 2026

Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..
సెప్టెంబర్ 22, 2026

Russia Sanctions Bill | రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. ఇక భారత్‌పై 100% టారిఫ్స్..!
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ

Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం



