Hijack Alert | టేకాఫ్‌కు ముందు.. ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ అలర్ట్
Hijack Alert | కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Kolkata Airport) టేకాఫ్‌కు ముందు ఎయిర్ ఇండియా విమానానికి హైకాజ్ అలర్ట్ (Hijack Alert) కలకలం రేపింది. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది ప్రయాణికులను దించేసి విమానాన్ని ఐసొలేషన్ బేకు తరలించారు.
Hijack Alert | త్రినేత్ర న్యూస్ : కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Kolkata Airport) ఎయిర్ ఇండియా విమానానికి హైకాజ్ అలర్ట్ (Hijack Alert) కలకలం రేపింది. విమానంలోని టాయిలెట్ అద్ధంపై హైజాక్‌కు సంబంధించిన బెదిరింపు సందేశం రాసి ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఈ బెదిరింపు సందేశం సిబ్బంది కంట పడింది. అప్రమత్తమైన పైలట్ వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు.
సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని ప్రయాణికులను దించేసి విమానాన్ని ఐసొలేషన్ బేకు తరలించారు. అక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), ప్రత్యేక భద్రతా సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కాగా, ఈ విమానం కోల్‌కతా ఎయిర్‌పోర్టు నుంచి ఇవాళ ఉదయం 10:20కి ముంబైకి టేకాఫ్ అవ్వాల్సి ఉంది. బెదిరింపు సందేశంలో 11:10కి విమానాన్ని హైజాక్ చేస్తామని ఉన్నట్లు అధికారులు తెలిపారు.
దీని వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు, భద్రతా దళాలు దర్యాప్తు చేపట్టారు. విమానాశ్రయంతోపాటూ విమానం లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. హైజాక్ ఘటనతో విమానాశ్రయంలో కాసేపు గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Also Read..
టెకీలకు ఐబీఎం షాక్.. హెచ్-1బీ వీసాలు, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌లను నిలిపివేసిన టెక్ దిగ్గజం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Air India Flight | టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్.. శంషాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం
అక్టోబర్ 23, 2026

Air India Flight | హైజాక్ పుకార్లు.. ఫ్రాంక్ఫర్ట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం దారిమళ్లింపు
అక్టోబర్ 14, 2026

Kolkata Airport | కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్..
అక్టోబర్ 8, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | బీజేపీతో పోరాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది..
- ●Nifty 50 | నిఫ్టీ 28,000కు చేరుతుందా? మూడు అంతర్జాతీయ బ్రోకరేజీల అంచనాలివే!
- ●Vijayasai Reddy | విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ‘పరివర్తన రాజనీతి పార్టీ’.. 2029 ఎన్నికల్లో పోటీకి సై
- ●Nvidia | ఎన్విడియా షేర్లకు భారీ షాక్.. రెండు రోజుల్లో 470 బిలియన్ డాలర్ల నష్టం..
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు.. బంగారంపై పెట్టుబడులకు భారీ ఆసక్తి..
- ●Green India Challenge | ప్రతి ఇంటా ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం

CM Revanth Reddy | బీజేపీతో పోరాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది..

Nifty 50 | నిఫ్టీ 28,000కు చేరుతుందా? మూడు అంతర్జాతీయ బ్రోకరేజీల అంచనాలివే!

Vijayasai Reddy | విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ‘పరివర్తన రాజనీతి పార్టీ’.. 2029 ఎన్నికల్లో పోటీకి సై

Nvidia | ఎన్విడియా షేర్లకు భారీ షాక్.. రెండు రోజుల్లో 470 బిలియన్ డాలర్ల నష్టం..



