Supreme Court| ట్విషా మృతి కేసు దర్యాప్తు.. ఆ కథనాలు తీవ్రంగా కలచివేశాయి: సుప్రీంకోర్టు
Supreme Court | నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసును సుప్రీంకోర్టు (Supreme Court) సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణను న్యాయవ్యవస్థ ఆలస్యం చేస్తోందని, నీరుగారుస్తోందంటూ వస్తున్న కథనాలు తమను తీవ్రంగా కలచివేశాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
Supreme Court | భోపాల్‌కు చెందిన నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు (Twisha Sharma death case) దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసును సుప్రీంకోర్టు (Supreme Court) సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణను న్యాయవ్యవస్థ ఆలస్యం చేస్తోందని, నీరుగారుస్తోందంటూ వస్తున్న కథనాలు తమను తీవ్రంగా కలచివేశాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు రిపోర్టింగ్ విషయంలో మీడియా సంయమనం పాటించాలని సూచించింది. అంతేకాదు, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడం సరైన చర్యే అని అభిప్రాయపడింది.
ట్విషా శర్మ (Twisha Sharma) ఈ నెల 12న తన అత్తవారింట్లో శవమై కనిపించింది. అప్పటికి ఆమెకు పెళ్లై ఐదు నెలలే. అత్తింటి వేధింపులే ఆమె మృతికి కారణమంటూ వార్తలు వచ్చాయి. ఆమె భర్త సమర్థ్ సింగ్ ఓ లాయర్. ఆమె అత్త కూడా విశ్రాంత న్యాయమూర్తి. దీంతో కేసు దర్యాప్తును న్యాయవ్యవస్థ ప్రభావితం చేస్తోందంటూ ట్విషా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విషా కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించడానికి దారితీసిన పరిస్థితులను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వివరించారు.
"మృతురాలి భర్త ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది. ఆమె అత్త జిల్లా మాజీ జడ్జి. ఈ కారణంతోనే కేసు దర్యాప్తు పక్కదారిపడుతోందని అనడం సరికాదు. ఆ కథనాలు తీవ్రంగా కలచివేశాయి. వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితులు, సాక్షులు ఇచ్చే ప్రకటనలను ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలను ధర్మాసనం ఆదేశించింది. బాధితురాలి కుటుంబ సభ్యుల వద్ద ఉన్న సమాచారాన్ని దర్యాప్తు సంస్థల ముందు మాత్రమే రికార్డ్ చేయించాలని, తద్వారా కొనసాగుతున్న విచారణపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా ఉంటుందని పేర్కొంది.
ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని.. ఇది ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఓ సందేశం అని తెలిపింది. కూతురిని శాశ్వతంగా కోల్పోవడం కంటే విడాకులు ఇప్పించడమే ఎంతో మేలన్న సందేశాన్ని ఈ కేసు తెలియజేస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇక ఈ కేసులో రెండవసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇప్పటికే ఆదేశించిన విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. హైకోర్టు ఆదేశాన్ని ప్రశంసించింది.
Also Read..
అందుకే టీవీకేకి మద్దతిచ్చాం.. ఉదయనిధి వెన్నుపోటు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్
అస్సాం అసెంబ్లీ ముందుకు ఉమ్మడి పౌర స్మృతి బిల్లు.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు
యూపీఎస్సీ గ్రూప్ ఏ, బీ గేజిటెడ్ ఉద్యోగాలు.. 194 పోస్టులతో నోటిఫికేషన్
సంబంధిత వార్తలు

Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
సెప్టెంబర్ 22, 2026

Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
సెప్టెంబర్ 22, 2026

Dharmasthala Case | మరోసారి తెరపైకి ధర్మస్థల హత్యాచార కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Kayadu Lohar | ఆ విషయంలో అదృష్టవంతురాలిని - సుబ్బలక్ష్మిగా సర్ప్రైజ్ చేస్తా - కయదు లోహర్ కామెంట్స్
- ●Minister Vakiti Srihari | జూరాలపై రాజకీయ రాద్ధాంతం వద్దు..
- ●Stock Markets | చమురు ధరలు తగ్గినా.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులే
- ●Malaysia Visa-Free Travel India | మలేషియా వీసా-ఫ్రీ ట్రిప్‌తో ఉద్యోగాల కోసం వెళ్తున్నారా? అది చట్టరీత్యా నేరం.. భారత్ హెచ్చరిక
- ●OnePlus N6 Lite | వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్.. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు..

Kayadu Lohar | ఆ విషయంలో అదృష్టవంతురాలిని - సుబ్బలక్ష్మిగా సర్ప్రైజ్ చేస్తా - కయదు లోహర్ కామెంట్స్

Minister Vakiti Srihari | జూరాలపై రాజకీయ రాద్ధాంతం వద్దు..

Stock Markets | చమురు ధరలు తగ్గినా.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులే



