Congress Vs DMK | అందుకే టీవీకేకి మద్దతిచ్చాం.. ఉదయనిధి వెన్నుపోటు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్
Congress Vs DMK | రాజకీయ లబ్ధి కోసం హస్తం పార్టీ తమను వెన్నుపోటు పొడిచిందంటూ కాంగ్రెస్ పార్టీపై డీఎంకే (Congress Vs DMK) నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఉదయనిధి వ్యాఖ్యలను కాంగ్రెస్ గట్టిగా తిప్పికొట్టింది.
Congress Vs DMK | రాజకీయ లబ్ధి కోసం హస్తం పార్టీ తమను వెన్నుపోటు పొడిచిందంటూ కాంగ్రెస్ పార్టీపై డీఎంకే (Congress Vs DMK) నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఉదయనిధి వ్యాఖ్యలను కాంగ్రెస్ గట్టిగా తిప్పికొట్టింది. ఉదయనిధి వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాణికం ఠాకూర్ (Manickam Tagore) వ్యాఖ్యానించారు. కష్టకాలంలో డీఎంకేకు కాంగ్రెస్ అండగా నిలిచిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పొత్తు రాజకీయాల్లో తమ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు.
విజయ్ నేతృత్వంలోని టీవీకేతో కూటమిని ఏర్పాటు చేయాలనే తమ పార్టీ నిర్ణయం.. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో బీజేపీ పట్టు సాధించకుండా అడ్డుకునేందుకేనని ఆయన స్పష్టం చేశారు. "కాంగ్రెస్ ఎప్పుడూ సెక్యులర్ కూటమి కోసమే పనిచేసింది. కానీ బీజేపీ మాత్రం డీఎంకే, ఏఐఏడీఎంకేలను కలిపే ప్రయత్నాలు చేస్తోంది. ఇది మా సిద్ధాంతాలకు వ్యతిరేకం. బీజేపీతో ఎలాంటి అవగాహన కుదుర్చుకున్నా కాంగ్రెస్ సహించబోదు" అని ఆయన స్పష్టం చేశారు.
కాగా, కాంగ్రెస్ పార్టీని డీఎంకే ఇకపై ఎన్నటికీ నమ్మదని, ఆ జాతీయ పార్టీ నాయకులకు కనీస కృతజ్ఞత, సంస్కారం లేవు అంటూ స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. "కాంగ్రెస్ ఐదు స్థానాల్లో గెలవడానికి డీఎంకే కార్యకర్తలే కారణం. ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు వారికి ఓటు వేశారు. కానీ ఈరోజు కొన్ని పదవుల కోసం వారు మాకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా పారిపోయారు. వారిని ఇకపై మన దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు. త్వరలోనే తమిళనాడు ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీనే కారణం. అసెంబ్లీ ఎన్నికల్లో మా నాయకుడు ఎంకే స్టాలిన్ కాంగ్రెస్‌ను తన భుజాలపై మోశారు" అని ఉదయనిధి స్టాలిన్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఉదయనిధి వ్యాఖ్యలపై మాణికం ఠాకూర్ పైవిధంగా స్పందించారు.
Also Read..
అస్సాం అసెంబ్లీ ముందుకు ఉమ్మడి పౌర స్మృతి బిల్లు.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు
ఆకాశంలో పారాగ్లైడర్‌ను ఢీ కొట్టిన విమానం.. భాయనక దృశ్యాలు
సంబంధిత వార్తలు

Rahul Gandhi | మొదట ఓటు చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ.. ఈసీపై రాహుల్ గాంధీ విమర్శలు
సెప్టెంబర్ 18, 2026

Karnataka MLAs niece | పీజీ చదువుతూనే వైద్యురాలిగా ప్రభుత్వ ఉద్యోగం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలిపై వేటు
సెప్టెంబర్ 16, 2026

Gen Z | సీనియర్లను మట్టికరిపించారు.. జైపూర్ ఎన్నికల్లో జెన్ జీ యూవత
సెప్టెంబర్ 16, 2026
తాజావార్తలు
- ●Kayadu Lohar | ఆ విషయంలో అదృష్టవంతురాలిని - సుబ్బలక్ష్మిగా సర్ప్రైజ్ చేస్తా - కయదు లోహర్ కామెంట్స్
- ●Minister Vakiti Srihari | జూరాలపై రాజకీయ రాద్ధాంతం వద్దు..
- ●Stock Markets | చమురు ధరలు తగ్గినా.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులే
- ●Malaysia Visa-Free Travel India | మలేషియా వీసా-ఫ్రీ ట్రిప్‌తో ఉద్యోగాల కోసం వెళ్తున్నారా? అది చట్టరీత్యా నేరం.. భారత్ హెచ్చరిక
- ●OnePlus N6 Lite | వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్.. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు..

Kayadu Lohar | ఆ విషయంలో అదృష్టవంతురాలిని - సుబ్బలక్ష్మిగా సర్ప్రైజ్ చేస్తా - కయదు లోహర్ కామెంట్స్

Minister Vakiti Srihari | జూరాలపై రాజకీయ రాద్ధాంతం వద్దు..

Stock Markets | చమురు ధరలు తగ్గినా.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులే



