Uniform Civil Code | అస్సాం అసెంబ్లీ ముందుకు ఉమ్మడి పౌర స్మృతి బిల్లు.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు
Uniform Civil Code | రాష్ట్రంలో 'ఉమ్మడి పౌర స్మృతి' (Uniform Civil Code) అమలుకు సంబంధించిన బిల్లును అస్సాంలోని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం (Assam govt) నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
Uniform Civil Code | రాష్ట్రంలో 'ఉమ్మడి పౌర స్మృతి' (Uniform Civil Code) అమలుకు సంబంధించిన బిల్లును అస్సాంలోని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం (Assam govt) నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వివాహాలు, విడాకులు, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు, పెళ్లిళ్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి వంటి అంశాలు ఈ చట్టంలో ఉండనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అతుల్ బోరా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లును ప్రవేశపెట్టేకంటే ముందే ఇందుకు సంబంధించి అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని డిమాండ్ చేశాయి.
కాగా, తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల నేపథ్యంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ యూసీసీ అమలుకు ఈ నెలలోనే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అస్సాం సీఎంగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన హిమంత బిశ్వ శర్మ తన తొలి కేబినెట్ భేటీలోనే యూసీసీ బిల్లుపై చర్చించి, ఆమోద ముద్ర వేశారు. వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనానికి సంబంధించిన చట్టాలను ఏకీకృతం చేయడం, సరళీకృతం చేయడం ఈ బిల్లు లక్ష్యంగా ప్రభుత్వం తెలిపింది. గిరిజన జనాభాకు యూసీసీ పరిధి నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.
ఈ బిల్లు గనుక ఆమోదం పొందితే ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల సరసన దేశంలోనే యూసీసీ బిల్లును ఆమోదించిన మూడవ రాష్ట్రంగా అస్సాం నిలుస్తుంది. స్వాతంత్రం తర్వాత భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతిని (UCC) చట్టబద్ధంగా అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ (2025 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది) నిలిచింది.ఇక గోవాలో పోర్చుగీస్ సివిల్ కోడ్ ఆధారంగా ఎప్పటినుంచో ఉమ్మడి పౌర స్మృతి అమల్లో ఉంది. అలాగే గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు కూడా దీనిని అమలు చేయడానికి అవసరమైన ముసాయిదా (Draft), కమిటీలను సిద్ధం చేస్తున్నాయి.
Also Read..
ఆకాశంలో పారాగ్లైడర్‌ను ఢీ కొట్టిన విమానం.. భాయనక దృశ్యాలు
ఇదేనా కాంగ్రెస్ చెప్పిన మార్పు?. ఇదేనా ప్రజలకు ఇచ్చిన హామీల ఫలితం?: కేటీఆర్
1000 అడుగుల లోతైన లోయలోకి పడిపోయిన కారు.. 8 మంది యువకులు మృతి
తాజావార్తలు
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!

Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..





