త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | కోర్టు విచారణల వీడియోల అప్‌లోడ్‌పై సుప్రీంకోర్టు నిషేధం

Supreme Court | కోర్టు విచార‌ణ‌ల‌కు సంబంధించిన వీడియోల అప్‌లోడ్‌పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా కీల‌క ఆదేశాలు ఇచ్చింది.

D

National | Published On Jul 24, 2026, 3.55 pm IST

Supreme Court | కోర్టు విచారణల వీడియోల అప్‌లోడ్‌పై సుప్రీంకోర్టు నిషేధం
Advertisement

Supreme Court | కోర్టు విచార‌ణ‌ల‌కు సంబంధించిన వీడియోల అప్‌లోడ్‌పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా కీల‌క ఆదేశాలు ఇచ్చింది. సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌, సంబంధిత హైకోర్టుల రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్‌ ముందస్తు అనుమతి లేకుండా కోర్టు విచార‌ణ‌ల‌కు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లను సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయడం, రీ-పోస్ట్ చేయడం, లేదా అప్‌లోడ్ చేయ‌డంపై మ‌ధ్యంత‌ర నిషేధం విధించింది.

కోర్టుల ప్రత్యక్ష ప్రసారాల అనధికారిక వినియోగం, మార్ఫింగ్, మానిటైజేషన్‌ను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (CJI Justice Surya Kant), జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా పిటిష‌న‌ర్ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన సీనియ‌ర్ అడ్వొకేట్ వికాస్ సింగ్‌.. సోష‌ల్ మీడియా, ఇత‌ర డిజిట‌ల్ ప్లాట్‌ఫార‌మ్‌ల‌లో కోర్టు విచార‌ణ‌ల వీడియోలు దుర్వినియోగం అవుతున్న తీరును ధ‌ర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై సీజేఐ ధ‌ర్మాస‌నం తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. న్యాయస్థానాల ప్రత్యక్ష ప్రసారాల వీడియోలను సోషల్ మీడియాలో సెలెక్టివ్‌గా ఎడిట్ చేసి ఉప‌యోగిస్తుండ‌టం ప‌ట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనివల్ల న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలగడమే కాకుండా, ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని పేర్కొంది. ఈ అంశంపై వివ‌ర‌ణ కోరుతూ కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికారిక వెబ్‌సైట్లలో వెంట‌నే ప్రదర్శించాలని ఆదేశించింది. అయితే, సాధారణ వార్తా ప్రసారాలకు ఈ ఆదేశాలు వర్తించవని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.

Advertisement
Advertisement