CJP Protest | సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం.. తప్పుడు వార్తలపై మీడియాకు చురకలు..!
CJP Protest | ఢిల్లీలో సీజేపీ (CJP) నిరసన సందర్భంగా విద్యార్థులపై పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందంటూ మీడియాలో వచ్చిన కథనాలను ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ఖండించారు. అసలు కోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు కాలేదని, కేవలం ఒక వినతిపత్రాన్ని కేసుగా ప్రచారం చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
CJP Protest | ఢిల్లీలో సీజేపీ (CJP) నిరసన సందర్భంగా విద్యార్థులపై పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందంటూ మీడియాలో వచ్చిన కథనాలను ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ఖండించారు. అసలు కోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు కాలేదని, కేవలం ఒక వినతిపత్రాన్ని కేసుగా ప్రచారం చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఈ వార్తలపై స్పందించిన సీజేఐ సూర్యకాంత్.. మిశ్రా అనే వ్యక్తి ఈ అంశాన్ని ప్రస్తావించారని, అయితే తాను కేసును జాబితా చేయడానికి నిరాకరించినట్లు మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందన్నారు.
అది కేవలం ఒక వినతిపత్రం మాత్రమేనని, వాస్తవాలు నిర్ధారించుకోకుండా దాన్నే కేసుగా ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై రిజిస్ట్రీని పరిశీలించగా ఒక్క పేజీ కూడా దాఖలు కాలేదని తెలిసిందని తెలిపారు. బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం.. గత రెండు రోజులుగా ఈ అంశంపై బాధ్యతారహితంగా వార్తలు ప్రసారం చేశారని సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు. "కోర్టులో కేసు దాఖలైందని పూర్తిగా అవాస్తవ వార్తలు వచ్చాయి. ప్రధాన న్యాయమూర్తి కేసును లిస్ట్ చేయడానికి నిరాకరించారని కూడా ప్రచారం చేశారు. ఉదయం 10 గంటల వరకు కోర్టులో ఒక్క పేజీ కూడా దాఖలు కాలేదు. అది కేవలం మిశ్రానో, మరెవరో పంపిన ఒక వినతిపత్రం మాత్రమే. అలాంటి లేఖను రిట్ పిటిషన్‌గా ఎలా పరిగణించగలం? కానీ వాస్తవాలను ధ్రువీకరించుకోకుండానే వార్తలు ప్రసారం చేశారు" అని సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లో వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే కథనాలు ప్రచురించాలని, మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీజేఐ ఈ సందర్భంగా చురకలంటించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన






