MP Dharmapuri Aravind | తాగుదామంటే నీళ్లు లేవు.. సాగుకైతే అసలే లేవ్
MP Dharmapuri Aravind | కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ముక్కు లెక్కనే కట్టారని.. మొత్తం చెత్తనే ఉందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్ము లక్ష కోట్ల రూపాయలు పెట్టి కడితే ఈరోజు ఏం ఉపయోగం ఉందని ప్రశ్నించారు. తెలంగాణలో తాగు నీళ్లు, థర్మల్ పవర్ స్టేషన్లకు నీరు లేని స్థితి చేరుకున్నామన్నారు.
- లక్ష కోట్లు పెట్టి కడితే ఈరోజు ఏం యూస్ ఉంది
- తాగుదామంటే నీళ్లు లేవు.. సాగుకైతే అసలే లేవ్
- రేవంత్ మూడు బ్యారేజీలపైనే సీబీఐ విచారణ అడిగిండు
- మొత్తం కుంభకోణంపై ఎందుకు అడగడు?
- బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్
MP Dharmapuri Aravind | త్రినేత్ర.న్యూస్: కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ముక్కు లెక్కనే కట్టారని.. మొత్తం చెత్తనే ఉందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్ము లక్ష కోట్ల రూపాయలు పెట్టి కడితే ఈరోజు ఏం ఉపయోగం ఉందని ప్రశ్నించారు. తెలంగాణలో తాగు నీళ్లు, థర్మల్ పవర్ స్టేషన్లకు నీరు లేని స్థితి చేరుకున్నామన్నారు. ఇక సాగుకైతే అసలు నీళ్లే లేవన్నారు. రేవంత్‌రెడ్డేమో కేవలం మూడు బ్యారేజీల మీదనే సీబీఐ విచారణకు అడిగిండని విమర్శించారు. ఈమేరకు ఆయన శుక్రవారం మాట్లాడారు.
తెలంగాణలో ఈరోజు తాగడానికి కూడా నీళ్లు లేవ్. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏం చేస్తున్నదనే ప్రశ్న. 3 బ్యారేజీల పరిధిలోని 8,500 కోట్లకు మాత్రమే సీబీఐ విచారణకు ఇచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన మొత్తం కుంభకోణం మీద సీబీఐ విచారణకు రేవంత్‌రెడ్డి ఎందుకు అడగడం లేదు. దీనికి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి. కట్టినవాడు అవినీతి చేస్తే, ఆ అవినీతిపరుడ్ని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోంది. కేసీఆర్ కుటుంబాన్ని రక్షించే పనిలో సీఎం రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు. 28 నెలలు నిద్రపోయి, తీరా పిల్లర్లు కుంగిపోయి, ప్రాజెక్టు డ్యామేజ్ అయి రూ.30,000 కోట్లు ఖర్చయ్యాక ఇప్పుడు కేంద్రానికి లేఖలు రాస్తూ నాటకాలు ఆడుతున్నారు. కేసీఆర్ కుటుంబం రైతుల పేరుతో దోచుకున్న సొమ్ములో రాహుల్ గాంధీకి ఎంత ముట్టజెప్పారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు.
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏజెన్సీస్ అప్రూవల్ ఇయ్యకముందే వీళ్లు పనులు చేసుడు మొదలు పెట్టిర్రు. కాంట్రాక్టర్లకు పైసలు ఇయ్యాలే కమీషన్లు ఏస్కపోవాలే. 2018, డిసెంబర్ ఎలక్షన్ కోసం పైసలు కావాలే.. ఖర్సు ఎల్లాలే. 2019 లోక్‌సభ ఖర్సు ఎల్లాలే.. ఏం మిగలలే ఇగ.. మొత్తం చెత్తనే కట్టిండ్రు అరి బీజేపీ ఎంపీ మండిపడ్డారు.
ఎన్డీఎస్ఏ 2023లోనే రిపోర్ట్ ఇచ్చింది. కేంద్ర ఏజెన్సీల అప్రూవల్ లేకుండా, డీపీఆర్ పక్కనపెట్టి ఇష్టమొచ్చినట్టు బ్యారేజీల స్థలాలు, డిజైన్లు మార్చేశారు. అసలు లక్ష కోట్లు పెట్టిన ప్రాజెక్టుకు క్వాలిటీ ఆడిట్ కూడా లేదు. ఏదైనా అడిగితే నేనే ఇంజినీర్‌ని అని కేసీఆర్ గొప్పలకు పోతూ ప్రాజెక్టును ఫెవిక్విక్‌తో అతికించినట్టు చేసి సర్వనాశనం చేశారు. ఇంత స్పష్టంగా ఆధారాలున్నా రేవంత్ రెడ్డి ప్రాజెక్టు కుంభకోణం మొత్తం మీద సీబీఐ విచారణ ఎందుకు అడగడం లేదు? దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన





