త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sheikh Hasina | డిసెంబ‌ర్ 16న బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.. బిమ‌న్ విమానాన్ని పంపాల‌ని విజ్ఞ‌ప్తి

Sheikh Hasina | బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) డిసెంబర్ 16న స్వ‌దేశానికి వెళ్ల‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందుకోసం ప్ర‌యాణ ఏర్పాట్లు చేయాల‌ని బంగ్లా ప్ర‌భుత్వాన్ని కోరారు. ఢిల్లీ నుంచి వ‌చ్చేందుకు బిమ‌న్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ (Biman Bangladesh Airlines)ను పంపాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

D

National | Published On Nov 24, 2026, 11.25 am IST

Sheikh Hasina | డిసెంబ‌ర్ 16న బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.. బిమ‌న్ విమానాన్ని పంపాల‌ని విజ్ఞ‌ప్తి
Advertisement

Sheikh Hasina | త్రినేత్ర న్యూస్ : దాదాపు రెండేళ్లుగా భార‌త్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) స్వ‌దేశానికి తిరిగి వెళ్లే విష‌య‌మై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. డిసెంబర్ 16న ఢాకా (Dhaka) వెళ్ల‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 1971 డిసెంబర్ 16న పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి పొందింది. దీంతో డిసెంబర్ 16వ తేదీని బంగ్లాదేశ్‌లో విక్టరీ డే (Victory Day)గా జరుపుకుంటారు. అదే రోజును ఆమె స్వ‌దేశానికి తిరిగి వెళ్లేందుకు ఎంపిక చేసుకోవడం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త‌ సంత‌రించుకుంది.

"2024 ఆగస్టు 5న షేక్ హసీనా బంగ్లాదేశ్ విమానంలో భారత్‌కు వెళ్లినందున‌.. ఇప్పుడు ఢిల్లీ నుంచి తిరిగి ఢాకా తీసుకురావ‌డానికి ప్ర‌భుత్వం బిమ‌న్‌ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ (Biman Bangladesh Airlines) ఫ్లైట్‌ను పంపాలి. అప్పటి పరిస్థితుల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా ఆమెను దేశం నుంచి బ‌హిష్క‌రించారు. కాబట్టి డిసెంబర్ 16న విక్ట‌రీ డే రోజున ఆమె గౌర‌వంగా బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది" అని హ‌సీనా అధికార ప్రతినిధి సయ్యద్ మొజమ్మెల్ అలీ రాయిటర్స్‌కు ఇచ్చిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కొత్త పాస్‌పోర్టు కోసం ద‌ర‌ఖాస్తు

తాను స్వ‌దేశానికి తిరిగి వెళ్ల‌డానికి సిద్ధంగా ఉన్నానంటూ ఈ ఏడాది జులైలో హ‌సీనా కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగానే వ‌చ్చే నెల‌లో బంగ్లాదేశ్ వెళ్లేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆమె పాత పాస్‌పోర్ట్, జాతీయ గుర్తింపు కార్డును (NID) రద్దు చేయడంతో.. ఆమె కొత్త ట్రావెల్ డాక్యుమెంట్లు, ఐడీ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ మేర‌కు త‌న లాయ‌ర్ల ద్వారా న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌ను ఆశ్రయించారు. హసీనా బంగ్లాదేశ్ పౌరసత్వాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త పత్రాలు జారీ చేయాలని వారు ఆ లేఖలో అభ్యర్థించారు. హ‌సీనా బంగ్లాదేశ్ పౌరురాల‌ని, అంత‌ర్జాతీయ మాన‌వ హ‌క్కుల నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ ద‌ర‌ఖాస్తును పరిశీలించాల‌ని కోరారు.

స్వదేశంలో అడుగుపెడితే అరెస్ట్ తప్పదు

మరణశిక్ష ఎదుర్కొంటున్న హసీనా స్వదేశానికి తిరిగి వస్తే ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని బంగ్లాదేశ్ మంత్రి ఒకరు రాయిటర్స్‌కు స్పష్టం చేశారు. ఆమెను వెనక్కి తీసుకురావడానికి విమానాన్ని పంపే విషయమై భారత్‌తో ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని తెలిపారు. ఇదిలా ఉండ‌గా.. హ‌సీనాకు పాస్‌పోర్టు అవసరం లేదని, భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న 'నేరస్థుల అప్పగింత ఒప్పందం' (Extradition Treaty) ప్రకారం ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేవ్ ప్ర‌భుత్వం భారత్‌ను డిమాండ్ చేస్తోంది.

బంగ్లాలో అల్ల‌ర్లు

ఇదిలా ఉండ‌గా.. హ‌సీనా రాకకు మద్దతుగా గత వారం అవామీ లీగ్ మద్దతుదారులు దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ర్యాలీలు నిర్వ‌హించారు. న‌వంబ‌ర్ 19న దేశ‌వ్యాప్త బంద్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా బంగ్లా వ్యాప్తంగా హింసాత్మ‌క ఘ‌ట‌న‌లో చోటు చేసుకున్నాయి. అవామీలీగ్‌, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ శ్రేణుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ మాజీ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ (Muhammad Yunus) ఇంటికి నిర‌స‌న‌కారులు నిప్పు పెట్టారు. ప‌లువురి అధికారుల ఇళ్ల‌కు కూడా నిర‌స‌న‌కారులు నిప్పంటించారు.

Also Read..

స్కూల్ బ‌స్సును ఢీ కొట్టిన ట్ర‌క్కు.. న‌లుగురు విద్యార్థులు మృతి

చైనా బీవైడీకి భారీ షాక్‌.. యూరప్‌లో ఎస్‌యూవీ అమ్మ‌కాల‌పై నిషేధం!

జెన్స‌న్ హువాంగ్‌కు హ‌ర్ష‌ధ్వానాల‌తో స్వాగ‌తం ప‌లికిన ఉద్యోగులు.. వీడియో..

Advertisement
Advertisement