త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jangaon | తల్లికి తలకొరివి పెట్టేందుకు కన్నబిడ్డల నిరాకరణ.. గ్రామస్తులే అన్నీ తామై..

Jangaon | ఆమెకు ఐదుగురు కూతుళ్లు.. ఒక కుమారుడు.. చెప్పుకోవ‌డానికి పెద్ద కుటుంబం. అయినా ఆ త‌ల్లి చివ‌రి రోజుల్లో తోడుగా నిలిచేవారు క‌రువ‌య్యారు. ఆక‌రికి అనారోగ్యంతో మ‌ర‌ణించినా అంత్య‌క్రియ‌లు పెట్టేందుకు ముందుకు రాలేదు. వ‌చ్చిన ఇద్ద‌రు కూతుళ్లు ముందు న‌డిచేందుకు నిరాక‌రించారు.

G

Telangana | Published On Nov 24, 2026, 11.03 am IST

Jangaon | తల్లికి తలకొరివి పెట్టేందుకు కన్నబిడ్డల నిరాకరణ.. గ్రామస్తులే అన్నీ తామై..
Advertisement

Jangaon | త్రినేత్ర న్యూస్‌: ఆమెకు ఐదుగురు కూతుళ్లు.. ఒక కుమారుడు.. చెప్పుకోవ‌డానికి పెద్ద కుటుంబం. అయినా ఆ త‌ల్లి చివ‌రి రోజుల్లో తోడుగా నిలిచేవారు క‌రువ‌య్యారు. ఆక‌రికి అనారోగ్యంతో మ‌ర‌ణించినా అంత్య‌క్రియ‌లు పెట్టేందుకు ముందుకు రాలేదు. వ‌చ్చిన ఇద్ద‌రు కూతుళ్లు ముందు న‌డిచేందుకు నిరాక‌రించారు. దీంతో గ్రామాస్తులే అంతా తామై ఆ త‌ల్లికి అంతిమ వీడ్కోలు ప‌లికారు. ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న జనగామ (Jangaon) జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో జ‌రిగింది.

తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన నాగబండి పుష్పనీల (70) భర్త రాంచంద్రం గతంలోనే చనిపోయారు. ఆమెకు ఐదుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇప్ప‌టికే ఒక కూతురు మరణించింది. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు. అంద‌రూ ఉన్నా ఒంట‌రిగానే ఆమె జీవ‌నం సాగింది. వ్య‌ద్ధాప్యంలోనూ ఆమెకు ఎవ‌రూ అండ‌గా నిల‌వ‌లేదు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం చనిపోయారు. గ్రామ‌స్తులు ఆమె మరణవార్తను కూతుళ్లకు, కుమారుడికి ఫోన్‌ ద్వారా తెలియజేశారు. వారిలో ఇద్దరు కూతుళ్లు, అల్లుళ్లు మాత్రమే చివరిచూపు కోసం వచ్చారు. కానీ, పుష్పనీల అంత్యక్రియలు నిర్వహించేందుకు నిరాక‌రించారు. దీంతో గ్రామస్తులు ముందుకు వ‌చ్చారు. గ్రామస్తులంతా ఒక్కటై ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వ‌హించారు.

Advertisement
Advertisement