Asia Power Index | ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్.. 2026 ఆసియా పవర్ ఇండెక్స్‌లో 40.5 పాయింట్లతో సత్తా
Asia Power Index | ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా (Asias third most powerful country) భారత్ (India) తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ప్రాంతీయ నాయకత్వ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పనితీరుపై అంచనాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. మూడు స్థానాలు ఎగబాకిన మోదీ.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తర్వాత ఆసియాలో రెండో అత్యంత సమర్థవంతమైన నాయకుడిగా నిలిచారు.
Asia Power Index | త్రినేత్ర న్యూస్ : ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా (Asias third most powerful country) భారత్ (India) తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. దౌత్యపరమైన హోదా, రక్షణ రంగ భాగస్వామ్యం, సాంస్కృతిక విస్తరణ, భవిష్యత్ వనరుల విభాగాల్లో పురోగతి భారత్ స్థానాన్ని బలోపేతం చేసింది. ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మేధో సంస్థ లోవీ ఇన్‌స్టిట్యూట్ (Lowy Institute) విడుదల చేసిన 2026 'ఆసియా పవర్ ఇండెక్స్' నివేదిక (Asia Power Index) వెల్లడించింది. ఇక ఈ జాబితాలో అమెరికా 78.9 పాయింట్లతో తొలి స్థానంలో, 73.6 పాయింట్లతో చైనా రెండో స్థానంలో నిలిచాయి.
భారత్ మొత్తం పవర్ స్కోరు గతేడాది కంటే 0.5 పాయింట్లు మెరుగుపరుచుకుని 40.5 స్కోరుతో (మూడో స్థానం) సత్తా చాటింది. దౌత్య ప్రభావం, భవిష్యత్ వనరుల విభాగాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచినప్పటికీ భారత ఆర్థిక సామర్థ్యం స్వల్పంగా బలహీనపడినట్లు సదరు నివేదిక వెల్లడించింది. ఈ విభాగంలో భారత్ స్కోరు స్వల్పంగా తగ్గి 26.4 పాయింట్లకు పరిమితమైందని.. అయినప్పటికీ ఈ విభాగంలో మూడో స్థానాన్ని నిలబెట్టుకుందని తెలిపింది. రూపాయి విలువ బలహీనపడటం, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) విధానంలో మార్పులు, విదేశీ పెట్టుబడుల ప్రవాహంలో దాదాపు 20 బిలియన్ డాలర్ల తగ్గుదల ఇందుకు పాక్షిక కారణాలని లోవీ ఇన్‌స్టిట్యూట్ విశ్లేషించింది.
ఆర్థిక పరమైన ఈ ఎదురుదెబ్బ ఉన్నప్పటికీ భారత్ భవిష్యత్ వనరుల (ఫ్యూచర్ రిసోర్సెస్) స్కోరు 56.2 పాయింట్లకు ఎగబాకిందని తెలిపింది. 2026లో ఆర్థిక, దౌత్య రంగాల్లో మిశ్రమ ఫలితాలు కనిపించినప్పటికీ.. ఆసియాలో భారత్ మరింత ప్రభావవంతమైన శక్తిగా ఎదిగినట్లు వివరించింది. 70.3 పాయింట్ల స్కోరుతో దౌత్యపరమైన ప్రభావం భారత్‌కు అత్యంత బలమైన అంశంగా నిలిచిందని కొనియాడింది.
రెండో స్థానంలో మోదీ
ప్రాంతీయ నాయకత్వ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పనితీరుపై అంచనాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. మూడు స్థానాలు ఎగబాకిన మోదీ.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తర్వాత ఆసియాలో రెండో అత్యంత సమర్థవంతమైన నాయకుడిగా నిలిచినట్లు సదరు నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక వివరాలపై లోవీ ఇన్‌స్టిట్యూట్ సౌత్ ఈస్ట్ ఆసియా ప్రోగ్రామ్ డైరెక్టర్, ఆసియా పవర్ ఇండెక్స్ ప్రాజెక్ట్ లీడ్ డాక్టర్ హంటర్ మార్స్టన్ ఎక్స్ వేదికగా స్పందించారు. "భారత్ తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. 40.5 పాయింట్లకు చేరుకోవడం ద్వారా ఒక ప్రధాన శక్తిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఆర్థిక సామర్థ్యంలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, ప్రాంతీయ నేతల్లో జిన్‌పింగ్ తర్వాత మోదీ రెండో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా నిలిచారు" అని ఆయన పేర్కొన్నారు.
Also Read..
సన్యాసిగా తల్లివద్ద భిక్షాటన.. భావోద్వేగానికి గురైన సీఎం యోగి
పాఠ్యపుస్తకాల నాసిరకం ముద్రణపై NCERT సీరియస్.. బాధ్యులపై కఠిన చర్యలకు హామీ
మా నీరు తాగేందుకు పూర్తిగా సురక్షితమే.. FSSAI చర్యలపై బిస్లరీ వివరణ
సంబంధిత వార్తలు

Vladimir Putin on India | “అది నిజంగా అద్భుతం!”.. భారత వైవిధ్యంపై పుతిన్ ప్రశంసల జల్లు
నవంబర్ 22, 2026

Nitish Setu Controversy | నితీశ్ సేతుపై హైడ్రామా: ప్రధాని మోదీ పోస్టర్లు చించేసిన ఆర్జేడీ కార్యకర్తలు.. అసలు వివాదం ఇదే!
నవంబర్ 22, 2026

PM Modi Gamcha Swirl Vaishali | ఓపెన్ వాహనంలో మోదీ ‘గమ్చా’ మేనియా.. గంగా నదిపై భారీ బ్రిడ్జికి ‘నితీశ్ సేతు’ పేరు
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Mahesh Kumar Goud | 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీ చేపట్టబోతున్నం
- ●Adi Srinivas | 500 కాదు.. 5000 రోజులైనా కేసీఆర్ సీఎం కాలేరు
- ●Vishnu Manchu | బర్త్‌డే సర్ప్రైజ్ - కొత్త సినిమాను అనౌన్స్‌చేసిన మంచు విష్ణు - డైరెక్టర్‌గా పాపులర్ కొరియోగ్రాఫర్
- ●Uttam Kumar Reddy | పార్టీలో దీర్ఘకాలం కష్టపడ్డ నాయకులకు న్యాయం జరగాలి
- ●Godavari Pushkaralu Logo Design and Tagline | గోదావరి పుష్కరాల లోగో డిజైన్, ట్యాగ్ లైన్ పంపండి.. నగదు బహుమతులు గెలుచుకోండి
- ●Bullion Market | ఐదురోజుల నష్టాలకు బ్రేక్.. మళ్లీ పుంజుకున్న పసిడి, వెండి..!

Mahesh Kumar Goud | 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీ చేపట్టబోతున్నం

Adi Srinivas | 500 కాదు.. 5000 రోజులైనా కేసీఆర్ సీఎం కాలేరు

Vishnu Manchu | బర్త్‌డే సర్ప్రైజ్ - కొత్త సినిమాను అనౌన్స్‌చేసిన మంచు విష్ణు - డైరెక్టర్‌గా పాపులర్ కొరియోగ్రాఫర్

Uttam Kumar Reddy | పార్టీలో దీర్ఘకాలం కష్టపడ్డ నాయకులకు న్యాయం జరగాలి



