Bigg Boss Winner | పరారీలో బిగ్‌బాస్ విన్నర్ – లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు
బిగ్‌బాస్ తమిళ సీజన్ 8 విన్నర్ ముత్తుకుమారన్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం చెన్నై పోలీసులు వెతుకుతున్నారు. పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ముత్తుకుమారన్‌పై ఇటీవలే ఓ సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ కేసు పెట్టింది.
Entertainment | Published On Nov 24, 2026, 11.30 am IST
Bigg Boss Winner | బిగ్‌బాస్ తమిళ సీజన్ 8 విన్నర్ ముత్తుకుమారన్ అదృశ్యమయ్యాడు. అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. యూట్యూబర్‌గా ముత్తుకుమార్ జర్నీ మొదలైంది. నాన్ ముత్తుకుమారన్ పేరుతో అతడు ప్రారంభించిన యూట్యూబ్ ఛానెల్ ఫేమస్ కావడంతో సోషల్ మీడియాలో సెలిబ్రిటీగా మారాడు. తమిళ్ పేచ్చు ఎంగల్ ముచ్చ అనే షో కూడా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీలో బిగ్‌బాస్‌లో ఛాన్స్ దక్కించుకున్నాడు.
40 లక్షల ప్రైజ్‌మనీ....
బిగ్‌బాస్ తమిళ సీజన్ 8లో తన ఆటతీరులో అభిమానులకు ఆకట్టుకున్న ముత్తుకుమారన్ విజేతగా నిలిచాడు. విన్నర్‌గా నిలిచిన అతడికి 40 లక్షలకుపైనే ప్రైజ్‌మనీ దక్కింది. బిగ్‌బాస్ తర్వాత కొన్ని చిన్న సినిమాల్లో నటించాడు.
లైంగిక వేధింపుల కేసు....
ఇటీవలే ముత్తుకుమారన్‌పై ఓ సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ముత్తుకుమారన్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని తన కంప్లైంట్‌లో పేర్కొన్నది. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడమే కాకుండా తన నంబర్‌ను బ్లాక్‌లో పెట్టాడని, తప్పించుకొని తిరుగుతున్నాడని ఆ సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ ఆరోపణలు చేసింది. ఆమె కంప్లైంట్‌లో ముత్తుకుమారన్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పరారీలో...
పోలీసు కేసు నమోదు కావడంతో ముత్తుకుమారన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గత కొద్ది రోజులుగా అతడి ఇంటికి తాళం వేసి ఉంటుందని, ముత్తుకుమారన్‌తో పాటు కుటుంబసభ్యులు కూడా పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ముత్తు కుమార్‌ను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటుచేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Raashi Khanna | ఓ వైపు సినిమా – మరోవైపు వెబ్‌సిరీస్ – బ్రేక్ లేకుండా కష్టపడుతోన్న రాశీఖన్నా
నవంబర్ 23, 2026

Trisha | త్రిష పేరుతో తమిళనాడులో కొత్త అసోసియేషన్ – రాజకీయ అరంగేట్రానికి సన్నాహాలు షురూ?
నవంబర్ 23, 2026

Virosh | అనిరుధ్, కావ్య మారన్ రిసెప్షన్లో విరోష్ – ఫొటోలు చూశారా?
నవంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Sheikh Hasina | డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా.. బిమన్ విమానాన్ని పంపాలని విజ్ఞప్తి
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడులకు ఇదే అనుకూల సమయమా..?
- ●Jangaon | తల్లికి తలకొరివి పెట్టేందుకు కన్నబిడ్డల నిరాకరణ.. గ్రామస్తులే అన్నీ తామై..
- ●Truck Rams School Bus | స్కూల్ బస్సును ఢీ కొట్టిన ట్రక్కు.. నలుగురు విద్యార్థులు మృతి
- ●Jensen Huang | జెన్సన్ హువాంగ్ మళ్లీ సీఈఓ అవడం వెనుక.. వైట్ హౌస్ ప్రమేయం..
- ●BYD Ti7 | చైనా బీవైడీకి భారీ షాక్.. యూరప్‌లో ఎస్యూవీ అమ్మకాలపై నిషేధం!

Sheikh Hasina | డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా.. బిమన్ విమానాన్ని పంపాలని విజ్ఞప్తి

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడులకు ఇదే అనుకూల సమయమా..?

Jangaon | తల్లికి తలకొరివి పెట్టేందుకు కన్నబిడ్డల నిరాకరణ.. గ్రామస్తులే అన్నీ తామై..

Truck Rams School Bus | స్కూల్ బస్సును ఢీ కొట్టిన ట్రక్కు.. నలుగురు విద్యార్థులు మృతి



