Truck Rams School Bus | స్కూల్ బస్సును ఢీ కొట్టిన ట్రక్కు.. నలుగురు విద్యార్థులు మృతి
Truck Rams School Bus | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని కన్నౌజ్ (Kannauj) జిల్లాలో లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై (Lucknow-Agra Expressway) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఓ స్కూల్ బస్సును వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది (Truck Rams School Bus). ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 32 మంది గాయపడ్డారు.
Truck Rams School Bus | త్రినేత్ర న్యూస్ : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని కన్నౌజ్ (Kannauj) జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై (Lucknow-Agra Expressway) ఆగి ఉన్న ఓ స్కూల్ బస్సును వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది (Truck Rams School Bus). ఈ దుర్ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందగా.. 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం.. కౌశాంబికి (Kaushambi) చెందిన ఓరియంటల్ పబ్లిక్ స్కూల్ (Oriental Public School)కు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇలా మొత్తం 50 మంది కలిసి ఆగ్రాలోని తాజ్‌మహల్ సందర్శనకు పాఠశాల బస్సులో వెళ్లారు. యాత్ర ముగించుకుని వారు తిరిగి వస్తుండగా.. ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో థాథియా (Thathia) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సును పక్కన నిలిపారు. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బస్సును షోల్డర్ లేన్‌లో ఆపిన సమయంలో వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ట్రక్కు బస్సును బలంగా ఢీ కొట్టింది.
ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా 32 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 24 మంది విద్యార్థులు కాగా, 8 మంది పాఠశాల సిబ్బంది ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం కాన్పూర్‌కు తరలించగా.. మిగిలిన వారికి తిర్వా (Tirwa) మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. ట్రక్కు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బస్సు వెనుక భాగం నుజ్జునుజ్జు అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
చైనా బీవైడీకి భారీ షాక్.. యూరప్‌లో ఎస్‌యూవీ అమ్మకాలపై నిషేధం!
జెన్సన్ హువాంగ్‌కు హర్షధ్వానాలతో స్వాగతం పలికిన ఉద్యోగులు.. వీడియో..
ఓట్ల తొలగింపుతో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్న బీజేపీ: పొన్నం ప్రభాకర్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jangaon | తల్లికి తలకొరివి పెట్టేందుకు కన్నబిడ్డల నిరాకరణ.. గ్రామస్తులే అన్నీ తామై..
- ●Jensen Huang | జెన్సన్ హువాంగ్ మళ్లీ సీఈఓ అవడం వెనుక.. వైట్ హౌస్ ప్రమేయం..
- ●BYD Ti7 | చైనా బీవైడీకి భారీ షాక్.. యూరప్‌లో ఎస్‌యూవీ అమ్మకాలపై నిషేధం!
- ●Jensen Huang | జెన్సన్ హువాంగ్‌కు హర్షధ్వానాలతో స్వాగతం పలికిన ఉద్యోగులు.. వీడియో..
- ●Ponnam Prabhakar | ఓట్ల తొలగింపుతో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్న బీజేపీ: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●IPL 2027 | పంజాబ్ కింగ్స్‌లో కీలక మార్పు.. బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ కోచ్!

Jangaon | తల్లికి తలకొరివి పెట్టేందుకు కన్నబిడ్డల నిరాకరణ.. గ్రామస్తులే అన్నీ తామై..

Jensen Huang | జెన్సన్ హువాంగ్ మళ్లీ సీఈఓ అవడం వెనుక.. వైట్ హౌస్ ప్రమేయం..

BYD Ti7 | చైనా బీవైడీకి భారీ షాక్.. యూరప్‌లో ఎస్‌యూవీ అమ్మకాలపై నిషేధం!

Jensen Huang | జెన్సన్ హువాంగ్‌కు హర్షధ్వానాలతో స్వాగతం పలికిన ఉద్యోగులు.. వీడియో..





