Uday Krishna Reddy | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో మలుపు.. ఏ2గా సోదరుడు ప్రణయ్
Uday Krishna Reddy | మహిళా ఐపీఎస్ అధికారిణిపై లైంగిక దాడి, వేధింపుల ఆరోపణలతో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి (Uday Krishna Reddy) కేసు మరో మలుపు తిరిగింది. అతని సోదరుడిని పోలీసులు ఏ-2 నిందితుడిగా చేర్చారు.
Uday Krishna Reddy | త్రినేత్ర న్యూస్: మహిళా ఐపీఎస్ అధికారిణిపై లైంగిక దాడి, వేధింపుల ఆరోపణలతో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి (Uday Krishna Reddy) కేసు మరో మలుపు తిరిగింది. అతని సోదరుడిని పోలీసులు ఏ-2 నిందితుడిగా చేర్చారు. తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు బెదిరింపులు, వేధింపులకు గురిచేశాడంటూ మహిళా ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదుతో ఉదయ్ కృష్ణా రెడ్డిను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా ప్రణయ్ కృష్ణా రెడ్డి (Pranay Krishna Reddy).. ఆధారాలను (Evidence) తారుమారు చేసినట్లు గుర్తించారు. ఉదయ్ ఫోన్‌ను దాచిపెట్టినట్లు నిర్ధారించారు.
ఉదయ్ కృష్ణా రెడ్డి ఆత్మహత్యాయత్నం సమయంలో రాసిన సూసైడ్ నోట్‌ను ప్రణయ్ కృష్ణారెడ్డి దాచినట్లు విచారణలో బయటపడింది. అలాగే కీలక వీడియో ఆధారాలు కలిగిన మరో ఐఫోన్‌ను దాచడంలోనూ ప్రణయ్ (Tampering) పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఏ2 గా ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడిని పోలీసులు చేర్చారు. అయితే పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేలా కోర్టులో ప్రణయ్ ముందస్తు బెయిల్‌ను పొందాడు.
ఈఏడాది జూలై 18న మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి (Trainee IPS) ఫిర్యాదుతో ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదుచేశారు. జూలై 20న ఉదయ్ కృష్ణా రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతరం ఎస్ఆర్ నగర్‌లోని ఓ దవాఖానలో నాలుగు రోజులపాటు చికిత్స పొందారు. హాస్పిటల్ నుచి డిశ్చార్జ్ అయిన తర్వాత కనిపించకుండా పోయారు. అదే నెల 28న సాయంత్రం తన స్వాగ్రామం నుంచి హైదరాబాద్ వస్తుండగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని దామరచర్ల వద్ద అరెస్టు చేశారు.
తాజావార్తలు
- ●Thiruparankundram Hilltop Lamp Ritual | కార్తీక దీపం వేడుకలపై తీవ్ర ఉత్కంఠ.. మదురైలో 144 సెక్షన్ అమలు
- ●Thriller OTT | థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి సూర్య బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
- ●Bigg Boss Winner | పరారీలో బిగ్‌బాస్ విన్నర్ - లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు
- ●Sheikh Hasina | డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా.. బిమన్ విమానాన్ని పంపాలని విజ్ఞప్తి
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడులకు ఇదే అనుకూల సమయమా..?
- ●Jangaon | తల్లికి తలకొరివి పెట్టేందుకు కన్నబిడ్డల నిరాకరణ.. గ్రామస్తులే అన్నీ తామై..

Thiruparankundram Hilltop Lamp Ritual | కార్తీక దీపం వేడుకలపై తీవ్ర ఉత్కంఠ.. మదురైలో 144 సెక్షన్ అమలు

Thriller OTT | థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి సూర్య బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ

Bigg Boss Winner | పరారీలో బిగ్‌బాస్ విన్నర్ - లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు

Sheikh Hasina | డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా.. బిమన్ విమానాన్ని పంపాలని విజ్ఞప్తి





