Rahul Gandhi | అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ సైడ్ ప్లేయర్‌గా మిగిలిపోయింది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi | అంతర్జాతీయ దౌత్య వ్యవహారాల్లో భారత్ ప్రభావం తగ్గుతోందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చల్లో దాయాది పాకిస్థాన్ చురుగ్గా వ్యవహరిస్తుంటే.. భారత్ మాత్రం ప్రేక్షక పాత్రకే పరిమితమైందని విమర్శించారు. నిజం చెప్పాలంటే ప్రపంచ రాజకీయాల్లో భారత్ సైడ్ ప్లేయర్‌గా (side player) మిగిలిపోతోందని వ్యాఖ్యానించారు.
Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : భారత్ (India), విదేశాంగ విధానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ దౌత్య వ్యవహారాల్లో భారత్ ప్రభావం తగ్గుతోందన్నారు. కీలకమైన చర్చల్లో భారత్ కేవలం ఒక సైడ్ ప్లేయర్‌గా (side player) మిగిలిపోతోందని వ్యాఖ్యానించారు. అయితే, దాయాది పాకిస్థాన్ (Pakistan) మాత్రం ప్రపంచ రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటోందని చెప్పారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చల్లో దాయాది చురుగ్గా వ్యవహరిస్తోందని చెప్పారు. భారత్ మాత్రం ప్రేక్షక పాత్రకే పరిమితమైందని విమర్శించారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. అక్కడ ప్రఖ్యాత చికాగో విశ్వవిద్యాలయం (University of Chicago) విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. "భారతదేశానికి భౌగోళిక రాజకీయాలపై ఎల్లప్పుడూ లోతైన అవగాహన ఉంది. అంతర్జాతీయ భాగస్వామ్యాలతో పాటు సొంత ఆలోచనా విధానాన్ని కొనసాగించింది. జనాభా, పరిమాణం రీత్యా సహజంగానే బలమైన గొంతుక ఉన్న భారత్.. ప్రపంచ వేదికలపై చురుగ్గా పాలుపంచుకోవాలి. కానీ, ప్రస్తుతం కీలకమైన అంతర్జాతీయ చర్చల్లో భారత్ కేవలం ఒక సైడ్ ప్లేయర్‌గా మిగిలిపోయింది. దాయాది పాకిస్థాన్ మాత్రం అంతర్జాతీయ వ్యవహారాల్లో ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చల్లో (US-Iran War) బిజీగా ఉండగా.. భారత్ మాత్రం కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది" అని రాహుల్ విమర్శించారు. ప్రపంచ నేతలతో వ్యక్తిగత స్నేహాల ఆధారంగా అంతర్జాతీయ దౌత్యం, భౌగోళిక రాజకీయాలు నడవవని రాహుల్ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలే విదేశాంగ విధానానికి ప్రాతిపదిక కావాలని వ్యాఖ్యానించారు.
రాహుల్ ఒక పాక్ ఫ్యాన్ బాయ్
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అధికార బీజేపీ తీవ్రంగా స్పందించింది. విదేశీ గడ్డపై రాహుల్ దేశ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని బీజేపీ ప్రతినిధి సీఆర్ కేశవన్ మండిపడ్డారు. ప్రపంచ రాజకీయాలపై అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌కు రాహుల్ చీర్‌లీడర్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ పేరును రాహుల్ పదేపదే ప్రస్తావించడాన్ని బీజేపీ నేత ప్రదీప్ భండారి తీవ్రంగా ప్రశ్నించారు. "రాహుల్ గాంధీకి పాకిస్థాన్ అంటే ఎందుకంత పిచ్చి..! ప్రతి అంతర్జాతీయ వేదికపైనా రాహుల్ ఒక పాక్ ఫ్యాన్ బాయ్‌లా వ్యవహరిస్తున్నారు" అని భండారి వ్యాఖ్యానించారు.
Also Read..
అధికారం ఉందనే అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు.. సీఎం రేవంత్‌కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్
బంగారం ధరలు ఢమాల్.. ఒక్క రోజులోనే రూ.51వేలకు పైగా తగ్గుదల..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rahul Gandhi | రాజీపడిన ప్రధాని ఎప్పటికీ అక్కడ కూర్చోలేరు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు
నవంబర్ 20, 2026

KA Paul | రేవంత్ పాలనలో పెరిగిన అవినీతి.. లక్షల కోట్ల ప్రజాధనం దోపిడీ: కేఏ పాల్
నవంబర్ 19, 2026

Rahul Gandhi | పెను ప్రమాదంలో భారత ఆర్థిక వ్యవస్థ.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
నవంబర్ 18, 2026
తాజావార్తలు
- ●CM Yogi Adityanath | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం
- ●Rahul Gandhi | రాజీపడిన ప్రధాని ఎప్పటికీ అక్కడ కూర్చోలేరు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు
- ●Gold Prices | భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. కారణాలేమిటి..?
- ●Cheyutha Pensions | అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలి..
- ●Mahesh Goud | కోట నీలిమపై అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు అనైతికం...: మహేశ్ గౌడ్
- ●EPFO | పీఎఫ్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఇక 2 నెలల్లోనే నగదు..

CM Yogi Adityanath | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం

Rahul Gandhi | రాజీపడిన ప్రధాని ఎప్పటికీ అక్కడ కూర్చోలేరు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు

Gold Prices | భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. కారణాలేమిటి..?

Cheyutha Pensions | అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలి..



