Thriller OTT | థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి సూర్య బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
సూర్య హీరోగా నటించిన సీన్ మూవీ ఈ ఏడాది తమిళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. హీరోగానే కాకుండా నిర్మాతగా సూర్యకు పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. డిసెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Nov 24, 2026, 12.01 pm IST
Thriller OTT | విశ్వనాథ్ అండ్ సన్స్, కరుప్పు తర్వాత సీన్ మూవీతో ఈ ఏడాది మూడో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు సూర్య. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు జీతూ మాధవన్ దర్శకత్వం వహించాడు. కేవలం 30 కోట్ల బడ్జెట్‌తో హీరో సూర్య నిర్మించిన ఈ మూవీ 250 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. హీరోగానే కాకుండా నిర్మాతగాను సూర్య ఈ సినిమాతో జాక్‌పాట్ కొట్టేశారు.
థియేటర్లలో ఆడుతుండగానే...
ఈ బ్లాక్‌బస్టర్ మూవీ థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తమిళం, తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో విడుదల కాబోతున్నట్లు చెబుతోన్నారు.
ప్రేమలు ఫేమ్...
సీన్ మూవీలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించింది. ప్రేమలు ఫేమ్ నస్లీన్ విలన్ పాత్రలో కనిపించాడు. టోవినో థామస్, జ్యోతిక గెస్ట్ పాత్రల్లో ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. మాస్, కమర్షియల్ హీరో ఇమేజ్‌కు భిన్నంగా ఇందులో అంధుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూర్య ప్రయోగాత్మక పాత్రకు కనిపించి మెప్పించాడు. అతడితో పాటు నజ్రియా నజీమ్ నటనకు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి.
ప్రేమ్ రాజ్ ఇన్వేస్టిగేషన్...
ప్రేమ్‌రాజ్ (సూర్య) క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుంటాడు. ఎంతో మంది క్రిమినల్స్‌ను పట్టుకుంటాడు. సడెన్‌గా ఓ రోజు ప్రేమ్‌రాజ్ తన జాబ్‌కు రిజైన్ చేస్తాడు. అదే టైమ్‌లో సిటీలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఓ కిల్లర్ ఒకే తీరులో కొందరిని చంపుతుంటాడు. ఈ కేసును ఎలాగైన సాల్వ్ చేయమని ప్రేమ్‌రాజ్‌ను క్రైమ్ బ్రాంచ్ హెడ్ స్టీఫెన్ (లాల్) కోరుతాడు. విక్టర్ (టోవినో థామస్) అనే కిల్లర్ ద్వారా ప్రేమ్‌రాజ్ అంధుడనే నిజం బయటపడుతుంది. తనకు కంటిచూపు లేదనే నిజాన్ని దాచిపెట్టి అతడు డ్యూటీ చేశాడని తెలుసుకున్న స్టీఫెన్ జాబ్ నుంచి తీసేస్తాడు.
పోలీస్‌లా కాకుండా సాధారణ పౌరుడిలా ఈ సీరియల్ కిల్లర్ కేసును సాల్వ్ చేయాలని ఫిక్సవుతాడు ప్రేమ్‌రాజ్. ఈ కేసు ఇన్వేస్టిగేషన్‌లో మాయ (నజ్రియా నజీమ్) అనే యువతి సాయాన్ని తీసుకుంటాడు. వారి ఇన్వేస్టిగేషన్‌లో ఈ హత్యలు చేస్తుంది ఈశ్వర్ (నస్లీన్) అనే నిజం బయటపడుతుంది. వందకుపైగా మర్డర్లు చేశాడని కనిపెడతారు. అసలు ఈశ్వర్ ఎవరు? తమిళనాడు నుంచి అతడు హైదరాబాద్ ఎందుకువచ్చాడు? కంటిచూపు లేని ప్రేమ్‌రాజ్...మాయ సాయంతో ఈశ్వర్‌ను ఎలా పట్టుకున్నాడు? అన్నదే మిగిలిన కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telugu OTT | ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వెంకటేష్, త్రివిక్రమ్ మూవీ – మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వంద కోట్ల లాటరీ తగిలితే!
నవంబర్ 22, 2026

Bollywood OTT | ఆరు వందల కోట్ల బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది – క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్
నవంబర్ 21, 2026

OTT Releases This Week | ఈ వారం ఓటీటీలో 25 సినిమాలు రిలీజ్- టాలీవుడ్ నుంచి హయ్యెస్ట్
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Thiruparankundram Hilltop Lamp Ritual | కార్తీక దీపం వేడుకలపై తీవ్ర ఉత్కంఠ.. మదురైలో 144 సెక్షన్ అమలు
- ●Uday Krishna Reddy | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో మలుపు.. ఏ2గా సోదరుడు ప్రణయ్
- ●Bigg Boss Winner | పరారీలో బిగ్‌బాస్ విన్నర్ - లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు
- ●Sheikh Hasina | డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా.. బిమన్ విమానాన్ని పంపాలని విజ్ఞప్తి
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడులకు ఇదే అనుకూల సమయమా..?
- ●Jangaon | తల్లికి తలకొరివి పెట్టేందుకు కన్నబిడ్డల నిరాకరణ.. గ్రామస్తులే అన్నీ తామై..

Thiruparankundram Hilltop Lamp Ritual | కార్తీక దీపం వేడుకలపై తీవ్ర ఉత్కంఠ.. మదురైలో 144 సెక్షన్ అమలు

Uday Krishna Reddy | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో మలుపు.. ఏ2గా సోదరుడు ప్రణయ్

Bigg Boss Winner | పరారీలో బిగ్‌బాస్ విన్నర్ - లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు

Sheikh Hasina | డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా.. బిమన్ విమానాన్ని పంపాలని విజ్ఞప్తి



