త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thiruparankundram Hilltop Lamp Ritual | కార్తీక‌ దీపం వేడుక‌ల‌పై తీవ్ర ఉత్కంఠ‌.. మ‌దురైలో 144 సెక్ష‌న్ అమ‌లు

Thiruparankundram Hilltop Lamp Ritual | మదురై (Madurai) జిల్లా తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై నిర్వ‌హించ‌నున్న కార్తీక దీపం (Karthigai Deepam) వేడుక‌ల‌పై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. ఇవాళ సాయంత్రం దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమ‌తించిన నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు ప్ర‌త్యేక భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టారు. మ‌దురై జిల్లా వ్యాప్తంగా ప‌లు ఆంక్ష‌లు విధించారు. సభలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వ‌హించ‌డానికి అనుమ‌తి ఉండ‌దు. తిరుప్పరంకుండ్రం కొండ ప్రాంతాన్ని పోలీసులు ‘రెడ్ జోన్’ (Red Zone) గా ప్రకటించారు.

D

National | Published On Nov 24, 2026, 12.04 pm IST

Thiruparankundram Hilltop Lamp Ritual | కార్తీక‌ దీపం వేడుక‌ల‌పై తీవ్ర ఉత్కంఠ‌.. మ‌దురైలో 144 సెక్ష‌న్ అమ‌లు
Advertisement

Thiruparankundram Hilltop Lamp Ritual | త్రినేత్ర న్యూస్ : మదురై (Madurai) జిల్లా తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై నిర్వ‌హించ‌నున్న కార్తీక దీపం (Karthigai Deepam) వేడుక‌ల‌పై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. కొండ‌పై సికందర్ బాదుషా దర్గాకు (Sikandar Badusha Dargah) సమీపంలోని వివాదాస్పద స్తంభంపై దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమ‌తించిన విష‌యం తెలిసిందే. ఒకే ఒక్క‌సారి వెసులుబాటుగా నవంబర్ 24న ష‌ర‌తుల‌కు లోబ‌డి దీపారాధ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమ‌తించింది. ఈ నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ సంద‌ర్భంగా శాంతి భ‌ద్ర‌త‌ల దృష్ట్యా అధికారులు మ‌దురై జిల్లా వ్యాప్తంగా ప‌లు ఆంక్ష‌లు విధించారు. సభలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వ‌హించ‌డానికి అనుమ‌తి ఉండ‌దు. అంతేకాదు, సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు కొండ‌పైకి సాధార‌ణ భ‌క్తుల‌ను అనుమ‌తించ‌రు. వివాదాస్ప‌ద స్తంభం వ‌ద్ద దీపం వెలిగించే విషయంలో అనుకూల, వ్యతిరేక వర్గాలు పెద్ద ఎత్తున గుమికూడి ఆందోళనలకు దిగే అవకాశం ఉందని పోలీసుల హెచ్చ‌రిక‌ల‌ ఆధారంగా జిల్లా కలెక్టర్ నిషాంత్ కృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఆంక్షలు నవంబర్ 23 రాత్రి 9 గంటల నుంచి న‌వంబ‌ర్ 25 ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కూ అమ‌ల్లో ఉండ‌నున్నాయి. ఇప్ప‌టికే అధికారులు తిరుప్పరంకుండ్రం పరిసర ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు 5,000 నుంచి 5,600 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. తిరుప్పరంకుండ్రం కొండ ప్రాంతాన్ని పోలీసులు ‘రెడ్ జోన్’ (Red Zone) గా ప్రకటించి, డ్రోన్లు, మానవరహిత విమానాల (UAVs) ఎగురవేతపై పూర్తి నిషేధం విధించారు. కొండపై ఉన్న దర్గా, మసీదుల్లో జరిగే సాధారణ ప్రార్థనలకు, భక్తుల రాకపోకలకు ఎటువంటి ఆటంకం ఉండ‌ద‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.

సుప్రీం కీల‌క ఆదేశాలు

కొండ‌పై కార్దీక దీపాన్ని వెలిగించేందుకు అనుమతిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు (Supreme Court) శుక్ర‌వారం స్టే విధించిన విష‌యం తెలిసిందే. ఒకే ఒక్క‌సారి వెసులుబాటుగా ఈ ఏడాది నవంబర్ 24న ష‌ర‌తుల‌కు లోబ‌డి దీపారాధ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమ‌తించింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ మేర‌కు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ తాత్కాలిక అనుమ‌తిని వివాదాస్ప‌ద స్థ‌లంలో దీపం వెలిగించే సంప్ర‌దాయ హ‌క్కుకు తుది ఆమోదంగా గానీ, కొండపై ప్ర‌వేశం, ఆక్ర‌మ‌ణ లేదా నియంత్ర‌ణ‌కు సంబంధించి అద‌న‌పు హ‌క్కుగా గానీ ప‌రిగ‌ణించ‌రాద‌ని స్ప‌ష్టం చేసింది. భవిష్యత్‌లో దీపం వెలిగించడానికి దీనిని ఒక సాక్ష్యంగా చూపడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు, దీపతూన్ (Deepathoon) వద్ద దీపం వెలిగించేందుకు ఆలయ అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులతో కూడిన పరిమిత బృందానికి మాత్రమే అనుమతి ఉంటుందని స్ప‌ష్టం చేసింది. ఈ కార్యక్రమానికి సాధారణ ప్రజలను, భక్తులను అనుమతించకూడదని కోర్టు ఆదేశించింది.

శాంతి భ‌ద్ర‌త‌ల దృష్ట్యా అవ‌స‌ర‌మైతే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలను కూడా మోహరించేందుకు సుప్రీం ధ‌ర్మాస‌నం అనుమ‌తించింది. కొండపై ఉన్న దర్గా, మసీదుల్లో జరిగే సాధారణ ప్రార్థనలకు, భక్తుల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని స్ప‌ష్టం చేసింది. న‌వంబ‌ర్ 24న జ‌రిగే కార్తీక దీపం వేడుక‌కు మాత్ర‌మే ఈ అనుమ‌తి ప‌రిమిత‌మ‌ని కోర్టు మ‌రోసారి స్ప‌ష్ట‌త‌నిచ్చింది. ఇక‌, ఈ అనుమతిని పునఃపరిశీలించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే సోమవారం ఈ పిటిషన్ విచారణ జాబితాలో రాలేదు. మంగళవారం పండుగ జరగనున్న నేపథ్యంలో, ప్రభుత్వం ప్రత్యేక విచారణ కోసం అత్యవసర జోక్యం కోరితే తప్ప వేడుకకు ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో వివాదాస్ప‌ద స్థ‌లంలో దీపం వెలిగించే అంశంపై తీవ్ర ఉత్కంఠ కొన‌సాగుతోంది.

Also Read..

డిసెంబ‌ర్ 16న బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.. బిమ‌న్ విమానాన్ని పంపాల‌ని విజ్ఞ‌ప్తి

స్కూల్ బ‌స్సును ఢీ కొట్టిన ట్ర‌క్కు.. న‌లుగురు విద్యార్థులు మృతి

జెన్స‌న్ హువాంగ్‌కు హ‌ర్ష‌ధ్వానాల‌తో స్వాగ‌తం ప‌లికిన ఉద్యోగులు.. వీడియో..

Advertisement
Advertisement