Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడులకు ఇదే అనుకూల సమయమా..?
Gold And Silver Prices Today | అమెరికా డాలర్ బలపడుతుండడం, పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఈక్విటీలకు భారీగా పెట్టుబడులు వెళ్తుండడం వంటి కారణాలతో గత 10 రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. అయితే సోమవారం సాయంత్రం అనూహ్యంగా ఆయా లోహాల ధరలు పుంజుకున్నాయి.
Gold And Silver Prices Today | అమెరికా డాలర్ బలపడుతుండడం, పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఈక్విటీలకు భారీగా పెట్టుబడులు వెళ్తుండడం వంటి కారణాలతో గత 10 రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. అయితే సోమవారం సాయంత్రం అనూహ్యంగా ఆయా లోహాల ధరలు పుంజుకున్నాయి. దీంతో గత సెషన్‌తో పోలిస్తే మంగళవారం గరిష్ట స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి. అయినప్పటికీ అమ్మకాల ఒత్తిడి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మంగళవారం గురునానక్ జయంతి సందర్భంగా దేశీయ కమోడిటీ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. అయినప్పటికీ సాయంత్రం సెషన్ యథావిధిగా 5 గంటలకు ప్రారంభం కానుంది. ఇక అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర ఇవాళ 0.11 శాతం స్వల్పంగా తగ్గి 3,631 డాలర్లకు చేరగా, వెండి ధర 1.43 శాతం పతనమై 42 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్ లో గత సెషన్ ముగింపులో వచ్చిన ర్యాలీ కారణంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రా్టు 4,218 పాయింట్లు ఎగసి 1,25,996 వద్ద ముగియగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 6,404 పాయింట్లు ఎగబాకి 1,54,217 వద్ద స్థిరపడింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ ఒక్క రోజే రూ.12వేలకు పైగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,780 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,02,240 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,27,800 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.12,78,000 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.12,400 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,715 ఉండగా, 8 గ్రాముల ధర రూ.93,720గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,17,150 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,71,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.11,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.9,585 ఉండగా, 8 గ్రాముల ధర రూ.76,680గా ఉంది. 10 గ్రాముల ధర రూ.95,850 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.9,58,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9,400 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.1,75,000 ఉండగా, తులం ధర రూ.1,750గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.1,75,000 ఉండగా, తులం ధర రూ.1,750 గా ఉంది.
తాజావార్తలు
- ●Jangaon | తల్లికి తలకొరివి పెట్టేందుకు కన్నబిడ్డల నిరాకరణ.. గ్రామస్తులే అన్నీ తామై..
- ●Truck Rams School Bus | స్కూల్ బస్సును ఢీ కొట్టిన ట్రక్కు.. నలుగురు విద్యార్థులు మృతి
- ●Jensen Huang | జెన్సన్ హువాంగ్ మళ్లీ సీఈఓ అవడం వెనుక.. వైట్ హౌస్ ప్రమేయం..
- ●BYD Ti7 | చైనా బీవైడీకి భారీ షాక్.. యూరప్‌లో ఎస్యూవీ అమ్మకాలపై నిషేధం!
- ●Jensen Huang | జెన్సన్ హువాంగ్‌కు హర్షధ్వానాలతో స్వాగతం పలికిన ఉద్యోగులు.. వీడియో..
- ●Ponnam Prabhakar | ఓట్ల తొలగింపుతో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్న బీజేపీ: మంత్రి పొన్నం ప్రభాకర్

Jangaon | తల్లికి తలకొరివి పెట్టేందుకు కన్నబిడ్డల నిరాకరణ.. గ్రామస్తులే అన్నీ తామై..

Truck Rams School Bus | స్కూల్ బస్సును ఢీ కొట్టిన ట్రక్కు.. నలుగురు విద్యార్థులు మృతి

Jensen Huang | జెన్సన్ హువాంగ్ మళ్లీ సీఈఓ అవడం వెనుక.. వైట్ హౌస్ ప్రమేయం..

BYD Ti7 | చైనా బీవైడీకి భారీ షాక్.. యూరప్‌లో ఎస్యూవీ అమ్మకాలపై నిషేధం!






