Opposition leaders | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. SIRపై సీజేఐకి లేఖ.. ఇండీ కూటమి కీలక నిర్ణయాలు
Opposition leaders | ఢిల్లీలో ప్రతిపక్ష ఇండీ కూటమి కీలక సమావేశం (INDIA bloc meet) ముగిసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ, ఓట్ల దోపిడీ అంశాలపై భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించారు.
Opposition leaders | ఢిల్లీలో ప్రతిపక్ష ఇండీ కూటమి కీలక సమావేశం (INDIA bloc meet) ముగిసింది. సుమారు 25 పార్టీల నాయకులు (Opposition leaders) ఈ సమావేశానికి హాజరై కేంద్రంపై పోరాటంలో అనసరించాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ, ఓట్ల దోపిడీ అంశాలపై భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించారు. అదేవిధంగా నీట్-సీబీఎస్‌ఈ (NEET-CBSE) పరీక్షల వివాదంపై కేంద్ర విద్యశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
#WATCH | Delhi: After the INDIA bloc meeting, Congress National President Mallikarjun Kharge says, "It was agreed to send a letter to the Chief Justice of India on SIR, vote loot and stealing elections. The letter is to be delivered to the Chief Justice of India very soon. Second… pic.twitter.com/WIfiwnGzvE
— ANI (@ANI) June 8, 2026
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి..
సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఐదు అంశాలపై కీలకంగా చర్చ జరిగినట్లు చెప్పారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, ఇతర ప్రజాసమస్యలతో పాటు దేశంలో ప్రమాదకరంగా ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేసినట్లు ఖర్గే తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో ప్రతిరోజూ ఉదయం ప్రతిపక్ష నేత కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తూ.. పార్లమెంటరీ సమన్వయాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు ఖర్గే వివరించారు.
#WATCH | Delhi | After the INDIA bloc meeting, Congress National President Mallikarjun Kharge says, "The Union government should immediately call an all-party meeting to discuss the precarious current economic situation, unemployment, price rise and farmers' issue and other… pic.twitter.com/yNlytlKjBZ
— ANI (@ANI) June 8, 2026
నెక్ట్స్ మీటింగ్ హైదరాబాద్‌లో..
ఇక ఈ భేటీలో ప్రతిపక్ష కూటమి నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రెండు నెలలకోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు ఖర్గే తెలిపారు. తదుపరి సమావేశం ఆగస్టులో హైదరాబాద్‌లో జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన తేదీని త్వరలోనే ఖరారు చేయనున్నట్లు ఖర్గే పేర్కొన్నారు.
#WATCH | Delhi: After the INDIA bloc meeting, Congress National President Mallikarjun Kharge says, "It was agreed that all parties of the INDIA alliance would meet every two months. The next meeting will be held in Hyderabad in August." pic.twitter.com/QK0EfAhEzu
— ANI (@ANI) June 8, 2026
న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన ఈ కీలక భేటీకి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్, సోనియాగాంధీ, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, సుప్రియా సూలే, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా 25 పార్టీల ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తమకు ద్రోహం చేసిందని ఆరోపించిన డీఎంకే ఈ సమావేశానికి దురంగా ఉంది. అలాగే ఇండి కూటమిలో తాము భాగం కాదని ఇప్పటికే ప్రకటించిన ఆప్ కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు.
సోనియా-దీదీ ఆలింగనం..
ఈ భేటీ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కూటమి చర్చలు ప్రారంభానికి ముందు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని ఆలింగనం చేసుకున్నారు.
Also Read..
ప్రజల సమస్యలపై పోరాడేందుకు మరింత ఐక్యతతో ముందుకెళ్దాం.. ఇండీ కూటమి భేటీలో ఖర్గే
బెంగాల్ 'పుష్పరాజ్' అరెస్ట్.. భారత్-నేపాల్ సరిహద్దుల్లో అదుపులోకి
1950 రాష్ట్రపతి ఉత్తర్వును సవరించాలి.. బాలకృష్ణన్ కమిషన్‌ను కలవనున్న బీఆర్ఎస్ బృందం
సంబంధిత వార్తలు

Mallikarjun Kharge | ప్రజల సమస్యలపై పోరాడేందుకు మరింత ఐక్యతతో ముందుకెళ్దాం.. ఇండీ కూటమి భేటీలో ఖర్గే
జూన్ 8, 2026

Pinarayi Vijayan | ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు.. రేవంత్‌పై పినరయి విజయన్ ఫైర్
జూన్ 8, 2026

INDIA bloc meet | ‘ఇండీ’ కూటమి సమావేశానికి టీవీకేకి అందని ఆహ్వానం.. కారణం చెప్పిన కాంగ్రెస్
జూన్ 8, 2026
తాజావార్తలు
- ●HDFC Bank MCLR Hike | HDFC కస్టమర్లకు బిగ్ షాక్: లోన్ వడ్డీ రేట్లు పెంపు.. ఇకపై పెరగనున్న మీ EMI భారం!
- ●Supreme Court | కానిస్టేబుల్ కేసు.. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!
- ●Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ - హీరోయిన్ ఎవరంటే?
- ●Bandi Sanjay vs Etela Rajender | ఆ పోస్టర్ల వెనక ఉన్నది కేంద్రమంత్రేనా?
- ●DGP CV Anand | పోలీసింగ్‌లో సాంకేతికతకు పెద్దపీట : డీజీపీ సీవీ ఆనంద్
- ●YouTuber | యూట్యూబర్ కొంప ముంచిన హోమ్‌టూర్ వీడియో.. రూ.10లక్షల విలువైన ఆభరణాలు చోరీ

HDFC Bank MCLR Hike | HDFC కస్టమర్లకు బిగ్ షాక్: లోన్ వడ్డీ రేట్లు పెంపు.. ఇకపై పెరగనున్న మీ EMI భారం!

Supreme Court | కానిస్టేబుల్ కేసు.. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!

Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ - హీరోయిన్ ఎవరంటే?

Bandi Sanjay vs Etela Rajender | ఆ పోస్టర్ల వెనక ఉన్నది కేంద్రమంత్రేనా?



