WhatsApp | వాట్సాప్‌లో భారీ గందరగోళం.. కారణం లేకుండానే వేల ఖాతాల సస్పెన్షన్..
WhatsApp | ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పలువురు వినియోగదారుల ఖాతాలను అకస్మాత్తుగా 24 గంటల పాటు అకౌంట్ ఇన్ రివ్యూ కింద ఉంచి, యాప్‌లోని అన్ని ఫీచర్లను నిలిపివేయడం కలకలం రేపింది. భారత్‌తోపాటు పలు దేశాల్లో ఈ సమస్య తలెత్తగా, ప్రభావిత వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా తమ ఆందోళన వ్యక్తం చేశారు.
Technology | Published On Aug 4, 2026, 3.28 pm IST
WhatsApp | ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పలువురు వినియోగదారుల ఖాతాలను అకస్మాత్తుగా 24 గంటల పాటు అకౌంట్ ఇన్ రివ్యూ కింద ఉంచి, యాప్‌లోని అన్ని ఫీచర్లను నిలిపివేయడం కలకలం రేపింది. భారత్‌తోపాటు పలు దేశాల్లో ఈ సమస్య తలెత్తగా, ప్రభావిత వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన వాట్సాప్ అధికార ప్రతినిధి.. సేవలను దుర్వినియోగం చేసే వారిని గుర్తించి ఇతర వినియోగదారుల భద్రతను కాపాడేందుకు సంస్థ నిరంతరం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అయితే కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి వినియోగదారులు మళ్లీ చాటింగ్ కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ముందస్తు హెచ్చరికలు లేకుండానే..
భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఈ అంతరాయం ప్రారంభమైంది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే అనేక మంది వినియోగదారుల ఖాతాలు రివ్యూకు వెళ్లడంతో వారు వాట్సాప్‌ను ఉపయోగించలేకపోయారు. ప్రభావిత ఖాతాల్లో వాట్సాప్ ఓ సందేశాన్ని ప్రదర్శించింది. అకౌంట్ ఇన్ రివ్యూ, రిక్వెస్టెడ్ డేట్, 3 ఆగస్టు 2026, మా సేవా నిబంధనలకు అనుగుణంగా మీ అకౌంట్ కార్యకలాపాలు, డివైస్ సమాచారాన్ని పరిశీలిస్తున్నాం. సాధారణంగా 24 గంటల్లో ఫలితాన్ని తెలియజేస్తాం.. అంటూ యూజర్లకు మెసేజ్ దర్శనమిచ్చింది. దీనికి దిగువన హౌ టు యూజ్ వాట్సాప్ రెస్పాన్సిబ్లీ అనే మార్గదర్శకాలు, అలాగే అబౌట్ స్టోలెన్ ఫోన్ అండ్ అకౌంట్స్ అనే సమాచారాన్ని చూసే అవకాశాన్ని కూడా యాప్ అందించింది.
వినియోగదారుల అసంతృప్తి..
ఈ ఘటనతో పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎలాంటి వివరణ లేకుండానే తమ వాట్సాప్ ఖాతాలను నిలిపివేశారని, అప్పీల్ చేసినప్పటికీ సాధారణంగా 24 గంటల్లో సమీక్ష పూర్తవుతుందనే సందేశం మాత్రమే కనిపిస్తోందని, అత్యవసరంగా సహాయం చేయాలని కోరారు. అలాగే తాము అధికారిక వాట్సాప్ యాప్‌నే ఉపయోగిస్తున్నప్పటికీ ఎలాంటి హెచ్చరిక లేకుండా అకౌంట్ నిలిపివేశారని, తమ ఉద్యోగాలకు వాట్సాప్ అత్యంత కీలకమని, ఈ చర్య పూర్తిగా అనవసరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ సమస్యకు అసలు కారణంపై వాట్సాప్ అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే తప్పుగా ప్రభావితమైన ఖాతాలను సమీక్షించి త్వరగా పునరుద్ధరిస్తామని సంస్థ తెలిపింది.
సంబంధిత వార్తలు

Bangaram Song | సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘బంగారం’ సాంగ్.. డెమాన్ పవన్, రీతూ కెమిస్ట్రీపై ప్రశంసలు
ఆగస్టు 6, 2026

WhatsApp | వాట్సాప్ గ్రూప్ చాట్స్‌లో భారీ మార్పులు.. పోల్స్, ఎట్ ఆల్, కొత్త గ్రూప్ ఫీచర్లు అందుబాటులోకి..
ఆగస్టు 6, 2026

Arvind Kejriwal | నా ఖాతాను ఎందుకు నిలిపివేశారు..? మెటాపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●JSW MG | ఒక్కసారి చార్జింగ్ చేస్తే 1100 కిలోమీటర్ల మైలేజ్.. భారత్‌లో ఎంజీ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు..
- ●Joginapally Santhosh Kumar | వెంకటాపూర్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. 2000 వేల మొక్కలు నాటిన సంతోష్‌కుమార్
- ●Bhatti Vikramarka | పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ.. కొత్త ఆలోచనలతో రండి.. ప్రభుత్వంతో కలిసి నడవండి: భట్టి విక్రమార్క
- ●Vijay-Stalin Junior War | సమస్య పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్తే తప్పేంటి..? సీఎం విజయ్ Vs జూనియర్ స్టాలిన్
- ●BJP Ramchandar Rao | తెలంగాణకు గొప్ప చేనేత వారసత్వం ఉంది.. కార్మికుల సమస్యల కోసం బీజేపీ పోరాడుతుంది
- ●Rahul Gandhi | బీజేపీలో మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు?.. ఇదీ రాహుల్ గాంధీ సమాధానం.. వీడియో

JSW MG | ఒక్కసారి చార్జింగ్ చేస్తే 1100 కిలోమీటర్ల మైలేజ్.. భారత్‌లో ఎంజీ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు..

Joginapally Santhosh Kumar | వెంకటాపూర్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. 2000 వేల మొక్కలు నాటిన సంతోష్‌కుమార్

Bhatti Vikramarka | పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ.. కొత్త ఆలోచనలతో రండి.. ప్రభుత్వంతో కలిసి నడవండి: భట్టి విక్రమార్క

Vijay-Stalin Junior War | సమస్య పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్తే తప్పేంటి..? సీఎం విజయ్ Vs జూనియర్ స్టాలిన్



