BRS Party | 1950 రాష్ట్రపతి ఉత్తర్వును సవరించాలి.. బాలకృష్ణన్ కమిషన్‌ను కలవనున్న బీఆర్ఎస్ బృందం
BRS Party | దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని బాలకృష్ణన్ కమిషన్‌కు నివేదిక అందించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ కమిషన్‌కు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం నివేదిక అందించనుంది.
BRS Party | త్రినేత్ర.న్యూస్ : దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని బాలకృష్ణన్ కమిషన్‌కు నివేదిక అందించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ కమిషన్‌కు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం నివేదిక అందించనుంది. ఈ బృందంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఉన్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం తెలంగాణలోని అన్ని క్రైస్తవ సంఘాల నాయకులు బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు నివాసంలో భేటీ అయి చర్చించారు.
ఈ దేశంలో మతం మారినంత మాత్రాన ఒక మనిషి సామాజిక పరిస్థితి మారిపోదు దళితుడు క్రైస్తవ మతంలోకి మారిన అతను ఎదుర్కునే వివక్ష అవమానాలు సామాజిక వెనుక బాటు తనం అలాగే కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసింది. క్రైస్తవ మతంలోకి మారిన దళితులు 1950 రాష్ట్రపతి ఉత్తర్వు కారణంగా షెడ్యూల్డ్ కులాల రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్ల కోల్పోతున్నారని పార్టీ ప్రతినిధుల బృందం తెలిపింది. ఈ నేపథ్యంలో పార్టీ నాలుగు ప్రతిపాదనలు చేసింది.
నాలుగు ప్రతిపాదనలు ఇవే..
- మతం మారినంత మాత్రాన సామాజిక వెనుకబాటుతనం పోదు.
- దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీలకు ఉన్న అన్ని రాజ్యాంగ హక్కులు కల్పించాలి.
- 1950 రాష్ట్రపతి ఉత్తర్వును సవరించాలని కేంద్రాన్ని కోరాలి.
- సామాజిక న్యాయం కోసం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అవసరం.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!
- ●Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం

Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం





