Meenakshi Natarajan | నామినేషన్ తిరస్కరిస్తే.. ఈసీనే పరిష్కరించాలి : మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ
Meenakshi Natarajan | తెలంగాణ పీసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. ఒక్కసారి నామినేషన్ తిరస్కరణకు గురైతే, అప్పుడు దాని పరిష్కారం కోసం ఎన్నికల సంఘాన్ని (EC) ఆశ్రయించాలని కోర్టు స్పష్టం చేసింది.
Meenakshi Natarajan | తెలంగాణ పీసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ నిర్ణయం ఎంత తప్పైనా.. ఒక్కసారి నామినేషన్ తిరస్కరణకు గురైతే, అప్పుడు దాని పరిష్కారం కోసం ఎన్నికల సంఘాన్ని (EC) ఆశ్రయించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
గత తీర్పులుంటే చూపించండి..?
విచారణ సందర్భంగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ దశలో కోర్టు జోక్యం చేసుకోగలదా..? అని ప్రశ్నించింది. గతంలో నామినేషన్ల పత్రాలను తిరస్కరించిన కేసుల్లో ఎప్పుడైనా కోర్టు జోక్యం చేసుకున్న తీర్పులు ఉన్నాయా..? అని సుప్రీంకోర్టు మీనాక్షి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ప్రశ్నించింది. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు జోక్యం చేసుకున్న సందర్భాలు ఏవైనా ఉంటే చూపించాలని కోరింది.
తప్పుడు పద్ధతిలో తిరస్కరించారు..
కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను మాత్రమే అభ్యర్థులు వెల్లడించాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుత కేసులో కేవలం సమన్లు మాత్రమే జారీ చేశారని న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు తెలిపారు. తప్పుడు పద్ధతిలో మధ్యప్రదేశ్ రిట్నరింగ్ అధికారి రాజ్యసభ నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్లు సింఘ్వీ వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. నామినేషన్ తిరస్కరణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు పిటిషన్ విచారణకు అర్హత లేదంటూ కొట్టివేసింది.
Also Read..
వాహనదారులకు అలర్ట్.. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై కేంద్రం ఆంక్షలు
అగ్నిప్రమాదంలో 4,000 ఈవీఎమ్‌లు దగ్ధం.. కుట్ర కోణం ఉందన్న బెంగాల్ మంత్రి
సయోని ఘోష్, యూసుఫ్ పఠాన్.. ఎన్డీయేకి మద్దతిస్తూ సంతకాలు చేసిన టీఎంసీ ఎంపీలు వీళ్లే..!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించుకోండి.. సివిల్ సర్వెంట్లు రోహిణి సింధూరి, రూపా కేసులో సుప్రీం వ్యాఖ్యలు..!
జూన్ 12, 2026

Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం
జూన్ 11, 2026

TMC-Congress | కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..? క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్
జూన్ 11, 2026
తాజావార్తలు
- ●Rahul Gandhi | నావికుల మృతిపై స్పందించని మోదీ.. మన కాంప్రమైజ్డ్ ప్రధానికి అంత ధైర్యం లేదంటూ రాహుల్ విమర్శలు
- ●Suicide | ఇద్దరు పిల్లలతో కలిసి నిజాంసాగర్‌లో దూకిన తండ్రి.. కామారెడ్డి జిల్లాలో ఘటన
- ●Stock Markets | ట్రంప్-ఇరాన్ డీల్ ఆశలు.. దలాల్ స్ట్రీట్‌లో భారీ జోష్..
- ●Salman Khan | కృష్ణ జింకల వేట కేసుపై సినిమా - కోర్టును ఆశ్రయించిన సల్మాన్ ఖాన్
- ●Congress Party | కొండల్ రెడ్డి vs షబ్బీర్ అలీ.. కామారెడ్డిలో తారాస్థాయికి విబేధాలు
- ●Sridhar Babu | తెలంగాణను గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతాం

Rahul Gandhi | నావికుల మృతిపై స్పందించని మోదీ.. మన కాంప్రమైజ్డ్ ప్రధానికి అంత ధైర్యం లేదంటూ రాహుల్ విమర్శలు

Suicide | ఇద్దరు పిల్లలతో కలిసి నిజాంసాగర్‌లో దూకిన తండ్రి.. కామారెడ్డి జిల్లాలో ఘటన

Stock Markets | ట్రంప్-ఇరాన్ డీల్ ఆశలు.. దలాల్ స్ట్రీట్‌లో భారీ జోష్..

Salman Khan | కృష్ణ జింకల వేట కేసుపై సినిమా - కోర్టును ఆశ్రయించిన సల్మాన్ ఖాన్



