4,000 EVMs destroyed | అగ్నిప్రమాదంలో 4,000 ఈవీఎమ్‌లు దగ్ధం.. కుట్ర కోణం ఉందన్న బెంగాల్ మంత్రి
4,000 EVMs destroyed | పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ భవనంలో మంటలు (massive fire) చెలరేగి ఏకంగా 4,000 ఈవీఎమ్‌లు దగ్ధమయ్యాయి (4,000 EVMs destroyed).
4,000 EVMs destroyed | పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ భవనంలో మంటలు (massive fire) చెలరేగి ఏకంగా 4,000 ఈవీఎమ్‌లు దగ్ధమయ్యాయి (4,000 EVMs destroyed). ఈ విషయాన్ని బెంగాల్ మంత్రి కౌశిక్ చౌధరి (Kaushik Chowdhury) ధృవీకరించారు. దక్షిణ కోల్‌కతా (Kolkata)లోని అలీపూర్ (Alipore) ప్రాంతంలో ఉన్న తొమ్మిది అంతస్తుల భవనంలో బుధవారం ఈ ప్రమాదం సంభవించినట్లు చెప్పారు.
"ఈ అగ్నిప్రమాదంలో సుమారు 4,000 ఈవీఎంలు (EVMs) పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో 10 నియోజకవర్గాల్లో ఈ ఈవీఎంలను ఉపయోగించారు" అని మంత్రి తెలిపారు. ఈ భవనంలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలతోపాటూ దక్షిణ 24 పరగణాల జిల్లా (South 24 Parganas district) పరిషత్ కార్యాలయం ఉన్నట్లు చెప్పారు. ఇది సాధారణంగా జరిగిన అగ్నిప్రమాదంలా కనిపించడం లేదన్నారు. తొలుత రెండు, మూడో అంస్తుల్లో మంటలు చెలరేగినట్లు గుర్తించామన్నారు. కానీ అవి మధ్యలో ఉన్న అంతస్తులకు కాకుండా.. తొమ్మిది, పదో అంస్తులకు ఎలా వ్యాపించాయనేది అస్పష్టంగా ఉందన్నారు. దీని వెనుక ఏదో కుట్ర కోణం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
Also Read..
సయోని ఘోష్, యూసుఫ్ పఠాన్.. ఎన్డీయేకి మద్దతిస్తూ సంతకాలు చేసిన టీఎంసీ ఎంపీలు వీళ్లే..!
షూటర్ మను బాకర్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత
ఇరాన్‌తో డీల్ కుదిరింది.. త్వరలోనే సంతకాలు.. ట్రంప్ కీలక ప్రకటన
తాజావార్తలు
- ●TG SET 2026 | టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు
- ●South Central Railway | 16 గంటలు రైలు ఆలస్యం.. దక్షిణ మధ్య రైల్వేకు రూ. 25 వేల జరిమానా
- ●Pavala Shyamala | విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..?
- ●Pavala Shyamala | ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
- ●Horoscope | జూలై 28 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక లాభాలు..!
- ●Morning Phone Habit | పొద్దున్నే లేవగానే మొబైల్ చూస్తున్నారా? ఇది అడిక్షన్ కాదట.. అసలు నిజం తెలిస్తే షాకవుతారు!

TG SET 2026 | టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు

South Central Railway | 16 గంటలు రైలు ఆలస్యం.. దక్షిణ మధ్య రైల్వేకు రూ. 25 వేల జరిమానా

Pavala Shyamala | విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..?

Pavala Shyamala | ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత






