Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం
Meenakshi Natarajan | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల ప్రక్రియపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాదు, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది. కోర్టు తీర్పుతో మధ్యప్రదేశ్‌లో ముగ్గురు బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు (BJP Rajya Sabha) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Meenakshi Natarajan | తెలంగాణ పీసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)కు గట్టి షాక్ తగిలింది. మధ్యప్రదేశ్‌లో ముగ్గురు బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ కేవట్ పేర్లను ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు. అయితే, తన నామినేషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ మీనాక్షి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై విచారణ సందర్భంగా మీనాక్షి నటరాజన్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. నటరాజన్ నామినేషన్‌ను అన్యాయంగా తిరస్కరించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై మధ్యంతర స్టే విధించాలని కోరారు. అయితే, కోర్టు అందుకు నిరాకరించింది. నటరాజన్ పిటిషన్‌పై జూన్ 12న విచారణకు స్వీకరించేందుకు అంగీకరించింది. అయితే, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పు తర్వాత ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. ఈ ప్రకటనతో హస్తం పార్టీకి గట్టి షాక్ తగిలినట్లైంది.
అసలేం జరిగిందంటే..?
మధ్యప్రదేశ్‌లోని మూడు రాజ్య సభ స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలోని బలాబలాల ప్రకారం రెండు స్థానాలను అధికార బీజేపీ సునాయాసంగా కైవసం చేసుకోనుండగా.. ఒక స్థానం కాంగ్రెస్‌కు దక్కే అవకాశం ఉంది. ఈ మూడో సీటు కోసం తెలంగాణ పీసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
అయితే, హైదరాబాద్‌లో నమోదైన క్రిమినల్ కేసు వివరాలు, ఆస్తులు, బ్యాంక్ లావాదేవీల వివరాలను ఆమె తన నామినేషన్ పత్రాల్లో దాచిపెట్టారని బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవత్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దానిని పరిశీలించిన రిటర్నింగ్ ఆఫీసర్ మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించారు. బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవట్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా అధికారులు ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా వివాదం చెలరేగింది. బీజేపీ ఇప్పటి వరకు ఓట్ చోరీకే పాల్పడింది.. ఇప్పుడు సీట్ చోరీకి కూడా పాల్పడుతున్నదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇదే విషయమై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి నామినేషన్ తిరస్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
Also Read..
నెహ్రూపై వ్యాఖ్యలు.. బీజేపీ కీలక నేతపై పోలీసులకు ఫిర్యాదు
కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..? క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్
గృహిణులను కేవలం హోమ్ మేకర్స్‌గా చూడొద్దు.. వారు 'దేశ నిర్మాతలు' : సుప్రీంకోర్టు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

TMC-Congress | కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..? క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్
జూన్ 11, 2026

Congress Nationwide Protest | దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ సై! ‘నీట్’ వివాదం, రాజ్యసభ నామినేషన్ రద్దుపై మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా బిగ్ ప్లాన్
జూన్ 11, 2026

Harish Rao | మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక.. రేవంత్ రెడ్డి వెన్నుపోటు కుట్ర : హరీశ్‌రావు
జూన్ 11, 2026
తాజావార్తలు
- ●Jawaharlal Nehru vs Savarkar | నెహ్రూ vs సావర్కర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌పై కాంగ్రెస్ పోలీస్ కంప్లైంట్
- ●Tollywood | సినిమాల్లోకి రాకముందు సేల్స్ గర్ల్‌గా పనిచేశా - టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
- ●Amazfit Cheetah | చీతా సిరీస్‌లో రెండు పవర్ఫుల్ స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేసిన అమేజ్‌ఫిట్
- ●TMC-Congress | కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..? క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్
- ●Congress Nationwide Protest | దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ సై! 'నీట్' వివాదం, రాజ్యసభ నామినేషన్ రద్దుపై మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా బిగ్ ప్లాన్
- ●Uttam Kumar Reddy | ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటి పారుదలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

Jawaharlal Nehru vs Savarkar | నెహ్రూ vs సావర్కర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌పై కాంగ్రెస్ పోలీస్ కంప్లైంట్

Tollywood | సినిమాల్లోకి రాకముందు సేల్స్ గర్ల్‌గా పనిచేశా - టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Amazfit Cheetah | చీతా సిరీస్‌లో రెండు పవర్ఫుల్ స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేసిన అమేజ్‌ఫిట్

TMC-Congress | కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..? క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్



