త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | నావికుల మృతిపై స్పందించ‌ని మోదీ.. మ‌న కాంప్ర‌మైజ్డ్ ప్ర‌ధానికి అంత ధైర్యం లేదంటూ రాహుల్ విమ‌ర్శ‌లు

Rahul Gandhi | ఒమ‌న్ తీరంలో ఓ వాణిజ్య నౌక‌పై అమెరికా జ‌రిపిన దాడిలో (US Attacks) ముగ్గురు భార‌తీయ నావికులు (Indian Sailors) మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోదీ మౌనం వహించ‌డాన్ని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.

D

National | Published On Jun 12, 2026, 4.05 pm IST

Rahul Gandhi | నావికుల మృతిపై స్పందించ‌ని మోదీ.. మ‌న కాంప్ర‌మైజ్డ్ ప్ర‌ధానికి అంత ధైర్యం లేదంటూ రాహుల్ విమ‌ర్శ‌లు
Advertisement

Rahul Gandhi | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్ అగ్ర‌నేత‌, లోక్‌స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఒమ‌న్ తీరంలో ఓ వాణిజ్య నౌక‌పై అమెరికా జ‌రిపిన దాడిలో (US Attacks) ముగ్గురు భార‌తీయ నావికులు (Indian Sailors) మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోదీ మౌనం వహించ‌డాన్ని రాహుల్ తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ట్వీట్ పెట్టారు.

అంత‌ర్జాతీయ జ‌లాల్లో కేవ‌లం మూడు రోజుల వ్య‌వ‌ధిలో మూడు నౌక‌ల‌పై అమెరికా ద‌ళాలు దాడులు జ‌రిపిన‌ట్లు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు భార‌తీయ నావికులు ప్రాణాలు కోల్పోయార‌న్నారు. కానీ, మ‌న కాంప్ర‌మైజ్డ్ ప్ర‌ధాని ఒక్క మాట కూడా మాట్లాడ‌టం లేద‌ని విమ‌ర్శించారు. విదేశీ శ‌క్తులు ఎవ‌రైనా ఒక భార‌తీయుడిని హ‌త్య చేస్తే.. మ‌న ప్ర‌ధాని క‌చ్చితంగా గ‌ళం విప్పాల‌ని పేర్కొన్నారు. కానీ ఆయ‌న నోట ఒక్క మాట కూడా రాక‌పోవ‌డం దారుణం అంటూ మండిప‌డ్డారు. ఈ కాంప్ర‌మైజ్డ్ ప్ర‌ధాని భ‌ర‌త మాత బిడ్డ‌ల‌ను ర‌క్షించ‌లేక‌పోతున్నారంటూ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎందుకంటే వారి ప్రాణాలు తీసిన వారిని నిల‌దీసే ధైర్యం కానీ, శ‌క్తి కానీ ఆయ‌న‌కు లేదు అని రాహుల్ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.

అస‌లేం జ‌రిగిందంటే..

ప‌లావు దేశ ప‌తాకంతో వెళ్తున్న 'సెట్టెబెల్లో' (Settebello) అనే చమురు ట్యాంకర్‌పై ఒమ‌న్ గ‌ల్ఫ్‌లో అమెరికా సైనిక దాడి చేసిన విష‌యం తెలిసిందే. గ‌త వారం ఈ దాడి జ‌రిగింది. ఇరాన్ నుండి చమురును రవాణా చేస్తోందనే కారణంతో దీనిపై దాడి చేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది. ఆ స‌మ‌యంలో అందులో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 24 మంది భార‌తీయ సిబ్బంది కాగా, విదేశీయుల్లో ఇద్ద‌రు పాకిస్థానీలు, ఒక‌రు ఉక్రెయిన్ , ర‌ష్యా వ్య‌క్తి ఉన్నారు.

దాడి త‌ర్వాత 21 మంది భార‌తీయ నావికుల‌ను ఒమ‌న్ తీర ర‌క్ష‌ణ ద‌ళం కాపాడింది. ముగ్గురు గ‌ల్లంత‌య్యారు. వారి కోసం గాలింపు చర్య‌లు చేప‌ట్టారు. దుర‌దృష్ట‌వ‌శాత్తూ గ‌ల్లంతైనట్లు భావించిన‌ ఆ ముగ్గురు నావికులు మ‌ర‌ణించిన‌ట్లు షిప్పింగ్ శాఖ మంత్రి స‌ర్బానంద సోనోవాల్ (Shipping Minister Sarbananda Sonowal) వెల్ల‌డించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. మృతుల కుటుంబ‌స‌భ్యుల‌ను ఆదుకునేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. మ‌రోవైపు గ‌ల్ఫ్ ఆఫ్ ఒమ‌న్‌లో నౌక‌లే ల‌క్ష్యంగా దాడులు కొన‌సాగుతున్నాయి. కేవ‌లం నాలుగు రోజుల వ్య‌వ‌ధిలోనే మూడు నౌక‌ల‌పై అమెరికా ద‌ళాలు దాడులు జ‌ర‌ప‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

అమెరికా దౌత్య వేత్త‌కు భార‌త్ స‌మ‌న్లు..

ఒమన్‌ తీరంలో భారతీయులతో వెళ్తున్న నౌకలపై అమెరికా దాడుల్ని న్యూ ఢిల్లీ తీవ్రంగా ఖండించింది. ఈ మేర‌కు ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్త (USA diplomat) జేసన్‌ మీక్స్‌కు సమన్లు జారీ చేసింది. గ‌త 48 గంట‌ల్లో అమెరికా దౌత్య‌వేత్త‌కు స‌మ‌న్లు జారీ చేయ‌డం ఇది రెండోసారి. అంతకుముందు ముగ్గురు భారతీయులు గల్లంతైన సమయంలోనూ భారత్‌ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. వ‌రుస దాడుల ప‌ట్ల తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

Also Read..

మీరు అమ్మే ఆయుధాల‌తో మాపై దాడి చేయొచ్చు.. మేం ర‌ష్యా చ‌మురు కొన‌కూడ‌దా..? యూర‌ప్ దేశాల‌కు జైశంక‌ర్ కౌంట‌ర్‌

ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి.. కామారెడ్డి జిల్లాలో ఘ‌ట‌న‌

ట్రంప్-ఇరాన్ డీల్ ఆశలు.. దలాల్ స్ట్రీట్‌లో భారీ జోష్..

Advertisement
Advertisement