త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sridhar Babu | తెలంగాణను గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతాం

Sridhar Babu | తెలంగాణను గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్రంలో ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

S

Telangana | Published On Jun 12, 2026, 3.47 pm IST

Sridhar Babu | తెలంగాణను గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతాం
Advertisement
  • ఎగుమ‌తుల సూచీలో రాష్ట్రం 8వ స్థానంలో ఉంది
  • ‘లాజిస్టిక్స్ పాలసీ 2.0’తో వసతులను వృద్ధి చేస్తాం
  • లాజిస్టిక్స్‌లోనూ సమర్థంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ వినియోగం
  • ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ స‌మావేశంలో మంత్రి శ్రీధర్ బాబు వెల్ల‌డి

Sridhar Babu | త్రినేత్ర‌.న్యూస్: తెలంగాణను గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్రంలో ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (FTCCI) ఆధ్వర్యంలో శుక్రవారం హెచ్ఐసీసీ నోవాటెల్ లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ 2026’ స‌మావేశంలో ఆయ‌న ముఖ్య అతిథిగా హాజరై ప్ర‌సంగించారు.

ఎగుమతుల సన్నద్ధత సూచీలో దేశవ్యాప్తంగా తెలంగాణ ఎనిమిదో స్థానంలో నిలిచింది. అదే... సముద్ర తీరం లేని రాష్ట్రాల (ల్యాండ్‌లాక్డ్) జాబితాలో రెండో స్థానంలో ఉంది. మర్చండైజ్ ఎగుమతుల్లో దేశంలోనే ఏడో స్థానంలో నిలవడం తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి నిదర్శనం. ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ లక్ష్యసాధనలో ‘లాజిస్టిక్స్’ రంగం కీలక పాత్ర పోషించేలా ప్రణాళికలు రూపొందించాం అని మంత్రి చెప్పారు.

స‌ముద్ర తీరం లేకున్నా..

తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడాన్ని ఒక పరిమితి(లిమిటేషన్)గా కాకుండా, ఒక డిజైన్ అడ్వాంటేజ్ గా మార్చుకుంటున్నాం. ‘లాజిస్టిక్స్ పాలసీ 2.0’ ద్వారా రాష్ట్రంలో మెగా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, డ్రై పోర్టులు, బాండెడ్ వేర్‌ హౌజింగ్, లాజిస్టిక్ పార్కుల అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నాం. లాజిస్టిక్ రంగానికి అవసరమైన రెడీ టూ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ తయారీకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్‌ను లాజిస్టిక్ రంగంలోనూ వినియోగించుకునేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం అని శ్రీ‌ధ‌ర్‌బాబు పేర్కొన్నారు.

మల్టీ మోడల్ లాజిస్టిక్స్, రైల్ లింక్డ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్ కార్గో, కోల్డ్ చైన్, గ్రేడ్ - ఏ వేర్ హౌజింగ్, ఆటోమేషన్, డిజిటల్ లాజిస్టిక్ ప్లాట్ ఫామ్స్, గ్రీన్ మొబిలిటీ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చాం అని మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ ఆర్.రవి కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కేకే మహేశ్వరి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గరిమెళ్ల, షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కమిటీ ఛైర్మన్ కమల్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement