Petrol Pumps | వాహనదారులకు అలర్ట్.. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై కేంద్రం ఆంక్షలు
Petrol Pumps | వాహనదారులకు కీలక అలర్ట్. పెట్రోల్, డీజిల్ (petrol and diesel)సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, పెద్ద కంపెనీలు ఇకపై పెట్రోల్ బంకుల నుంచి పెద్ద మొత్తంలో ఇంధనం కొనుగోలు చేయకుండా తాత్కాలిక ఆంక్షలు విధించింది.
Petrol Pumps | వాహనదారులకు కీలక అలర్ట్. పెట్రోల్, డీజిల్ (petrol and diesel)సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, పెద్ద కంపెనీలు ఇకపై పెట్రోల్ బంకుల నుంచి పెద్ద మొత్తంలో ఇంధనం కొనుగోలు చేయకుండా తాత్కాలిక ఆంక్షలు విధించింది. బల్క్ సప్లయ్ చైన్‌ల (bulk supply channels) నుంచే వారు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఒక వాహనానికి రోజుకు 200 లీటర్ల కంటే ఎక్కువ డీజిల్‌ను నింపొద్దని రిటైల్ అవుట్‌లెట్ల యాజమాన్యాలను (Petrol Pumps) కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ ఆదేశాలు జారీ చేసింది.
సాధారణంగా బల్క్ ఇంధన ధరలు, రిటైల్ ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు లీటర్ డీజిల్ ధర పెట్రోల్ బంకులో రూ.95.20గా ఉంటే.. అదే బల్క్‌లో ఈ ధర రూ.134.50గా ఉంటుంది. రిటైల్ అవుట్‌లెట్లలో ధరలు తక్కువగా ఉండటంతో.. కొందరు బల్క్ వినియోగదారులు పెట్రోల్ బంకుల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించారు. దీంతో రిటైల్ బంకుల్లో ఇంధన అమ్మకాలు అసాధారణ స్థాయిలో పెరిగాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో రిటైల్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం దీన్ని అరికట్టేందుకు పెట్రోల్, డీజిల్ విక్రయాలపై పరిమితులు, ఆంక్షలు విధించింది.
మరోవైపు ‘పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోసివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్’ (పీఈఎస్‌ఓ) అనుమతి పొందిన కంటైనర్లకు మాత్రమే డీజిల్ విక్రయించాలి. ఒక వినియోగదాడు లేదా ఒక వాహనానికి రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల వరకు మాత్రమే డీజిల్ ఇవ్వాలని కేంద్రం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంతేకాదు ఈ డీజిల్‌ను తిరిగి విక్రయించకూడదని తెలిపింది. హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్, డైవర్షన్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా పెట్టాలని కేంద్రం ఆదేశించింది. ఈ ఆంక్షలు మొదట 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైతే మరో ఉత్తర్వుతో గడువును పొడిగించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సాధారణ వినియోగదారులకు ఇంధన కొరత తలెత్తకుండా చూడటమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది.
Also Read..
సమ్మక్క-సారక్క ఎత్తిపోతల పథకానికి NOC ఇవ్వండి
అగ్నిప్రమాదంలో 4,000 ఈవీఎమ్‌లు దగ్ధం.. కుట్ర కోణం ఉందన్న బెంగాల్ మంత్రి
సయోని ఘోష్, యూసుఫ్ పఠాన్.. ఎన్డీయేకి మద్దతిస్తూ సంతకాలు చేసిన టీఎంసీ ఎంపీలు వీళ్లే..!
తాజావార్తలు
- ●Pavala Shyamala | విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..?
- ●Pavala Shyamala | ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
- ●Horoscope | జూలై 28 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక లాభాలు..!
- ●Morning Phone Habit | పొద్దున్నే లేవగానే మొబైల్ చూస్తున్నారా? ఇది అడిక్షన్ కాదట.. అసలు నిజం తెలిస్తే షాకవుతారు!
- ●Why People Avoid Jewelry | మెడలో, చేతులకు ఎలాంటి ఆభరణాలు ధరించని వారి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా?
- ●TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!

Pavala Shyamala | విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..?

Pavala Shyamala | ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత

Horoscope | జూలై 28 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక లాభాలు..!

Morning Phone Habit | పొద్దున్నే లేవగానే మొబైల్ చూస్తున్నారా? ఇది అడిక్షన్ కాదట.. అసలు నిజం తెలిస్తే షాకవుతారు!






