Salman Khan | కృష్ణ జింకల వేట కేసుపై సినిమా – కోర్టును ఆశ్రయించిన సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసు విచారణ గత ఇరవై ఎనిమిదేళ్లుగా కొనసాగు...తూనే ఉంది. ఈ కృష్ణ జింకల కేసుపై కాలా హిరణ్ పేరుతో ఓ బాలీవుడ్ మూవీ రాబోతుంది. శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాను రిలీజ్ చేయద్దంటూ సల్మాన్ ఖాన్ కోర్టును ఆశ్రయించారు.
Entertainment | Published On Jun 12, 2026, 3.58 pm IST
బాలీవుడ్ మూవీ కాలా హిరణ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. తన వ్యక్తిగత ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా సినిమా ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భరత్ ఎస్ శ్రీనాథ్ డైరెక్షన్‌లో కాలా హిరన్ బ్యాటిల్ ఫర్ లెగసీ పేరుతో నిర్మాత అమిత్ జానీ ఇటీవల ఓ సినిమాను అనౌన్స్‌చేశారు. శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అచ్చం సల్మాన్ ఖాన్‌ను పోలినట్లుగా ఓ నటుడు కనిపిస్తున్నారు. చెవి పోగు, హెయిర్ స్టైల్, బ్రాస్‌లెట్‌తో పాటు లుక్ కూడా సల్మాన్ ఖాన్ లాగే ఉన్నాయి. కృష్ణ జింకల కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్ ఎదుర్కొన్న ఆరోపణలు, కోర్టు అతడికి విధించిన శిక్షల తాలూకు న్యూస్ క్లిప్సింగ్స్ ఈ పోస్టర్‌లో కనిపిస్తోన్నాయి.
సల్మాన్ పిటిషన్...
కాలా హిరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసు ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు కనిపిస్తోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలా హిరణ్ సినిమాపై సల్మాన్ ఖాన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌తో పాటు రిలీజ్‌ను ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. తన పోలికలతోనే ఉన్న డూప్ క్యారెక్టర్‌ను పెట్టి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సల్మాన్ ఖాన్ ఆరోపించారు. తన ఇమేజ్, పేరుప్రఖ్యాతులను వాడుకుంటూ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతోనే కాలా హిరణ్‌ను రూపొందిస్తున్నారని చెప్పాడు. ప్రస్తుతం కృష్ణ జింకల కేసు కోర్టులో ఉందని, తుది తీర్పు వెలువడకుండా తనను దోషిగా చూపించడం ఎంత వరకు సమంజసం అంటూ పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ పిటిషన్‌పై జూలై ఫస్ట్ వీక్‌లో విచారణ జరుగనున్నట్లు సమాచారం.
టీజర్ రిలీజ్...
కాగా సల్మాన్ ఆరోపణలపై మేకర్స్ రియాక్ట్ అయ్యారు. కృష్ణ జింకల కేసు ఆధారంగా ఈ సినిమాను రూపొందించడం లేదని, జంతు సంరక్షణ కోసం బిష్టోయ్ తెగ చేస్తోన్న కృష్ణి, పోరాటాన్ని మాత్రమే ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలిపారు. సల్మాన్ ఖాన్ కేసు కూడా ఇందులో ఓ అంతర్భాగంగానే ఉంటుంది కానీ ఇదే మెయిన్ కథ కాదని చెబుతోన్నారు. జూన్ 20న కాలా హరణ్ టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నామని, ఆ టీజర్ ద్వారా సల్మాన్ ఆరోపణలపై సమాధానం ఇస్తామని చెబుతోన్నారు.
సినిమా షూటింగ్‌లో...
హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ కోసం 1998లో రాజస్థాన్‌లోని జోద్‌పూర్ వచ్చిన సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. సల్మాన్ ఖాన్‌తో పాటు సైఫ్ అలీఖాన్, టబు, సోనాలి బింద్రేలపై బిష్టోయ్ కమ్యూనిటీ వారు కేసు పెట్టారు. ఈ కృష్ణ జింకల కేసులో 2018లో సల్మాన్ ఖాన్‌కు జోద్‌పూర్ కోర్టు ఐదేళ్లు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సల్మాన్ ఖాన్ హైకోర్టును ఆశ్రయించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jairam Ramesh | ఈ20 ఇంధనం పర్యావరణానికి అనుకూలం కాదు : జైరామ్ రమేష్
- ●ETF | ఈటీఎఫ్ వర్సెస్ మ్యుచువల్ ఫండ్స్.. పెట్టుబడికి ఏది బెస్ట్..?
- ●Komatireddy Venkat Reddy | రూ.5 కోట్ల బకాయిలకు రూ.54 కోట్ల నోటీసు ఎలా ఇస్తారు? కాంట్రాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి నేనున్నా
- ●NEET Student | కానూరులో నీట్ కోచింగ్.. కుటుంబానికి దూరంగా ఉండలేక హైదరాబాద్ యువతి బలవన్మరణం
- ●ASUS Chromebook CX15 | తక్కువ ధరకే అసుస్ కొత్త క్రోమ్‌బుక్.. గూగుల్ ఏఐ ఫీచర్లతో..
- ●Jagadeesh Reddy | మేధావినని జయశంకర్ సార్ ఎన్నడూ చెప్పుకోలే.. తెలంగాణల ఇద్దరే మేధావులున్నరని ఓ సన్నాసి అన్నడు

Jairam Ramesh | ఈ20 ఇంధనం పర్యావరణానికి అనుకూలం కాదు : జైరామ్ రమేష్

ETF | ఈటీఎఫ్ వర్సెస్ మ్యుచువల్ ఫండ్స్.. పెట్టుబడికి ఏది బెస్ట్..?

Komatireddy Venkat Reddy | రూ.5 కోట్ల బకాయిలకు రూ.54 కోట్ల నోటీసు ఎలా ఇస్తారు? కాంట్రాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి నేనున్నా

NEET Student | కానూరులో నీట్ కోచింగ్.. కుటుంబానికి దూరంగా ఉండలేక హైదరాబాద్ యువతి బలవన్మరణం






