Congress Party | కొండల్ రెడ్డి vs షబ్బీర్ అలీ.. కామారెడ్డిలో తారాస్థాయికి విబేధాలు
Congress Party | కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి, సీనియర్ నేత షబ్బీర్ అలీ గ్రూప్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు.. షబ్బీర్ అలీని బహిరంగంగా హెచ్చరిస్తున్నాను అని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య గడ్డం ఇందుప్రియ పేర్కొన్నారు.
Congress Party | త్రినేత్ర.న్యూస్ : కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి, సీనియర్ నేత షబ్బీర్ అలీ గ్రూప్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు.. షబ్బీర్ అలీని బహిరంగంగా హెచ్చరిస్తున్నాను అని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య గడ్డం ఇందుప్రియ పేర్కొన్నారు. షబ్బీర్ అలీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఇందుప్రియ మీడియాతో మాట్లాడారు.
షబ్బీర్ అలీ అన్న కొడుకు షేర్ నన్ను అసభ్యంగా ట్రోల్ చేస్తున్నాడు. నేను క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాననే నా మీద కుట్రలు చేస్తున్నారు. నేను నా భర్త చంద్రశేఖర్ రెడ్డి( టీపీసీసీ జనరల్ సెక్రటరీ) నిత్యం ప్రజా సేవలోనే ఉంటాం. సీనియర్ నాయకుడిని అని చెప్పుకునే షబ్బీర్ అలీ మహిళల పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా? బయట దేశాల నుండి షబ్బీర్ ఆలీ సోషల్ మీడియాలో నా మీద అసభ్య పోస్టులు వేయిస్తున్నాడు. చర్ల రాజేష్ అనే సీనియర్ నాయకుడిని నేను బాబాయ్ అని పిలుస్తాను, అతను కూడా నా మీద వేసిన ట్రోల్స్ అన్ని గ్రూపులో షేర్ చేశాడు. నా గురించి ప్రచారం చేసేటప్పుడు మీ ఇంట్లో కోడలు, భార్య గుర్తుకు రాలేదా..? షబ్బీర్ అలీ అరాచకాల గురించి రాహుల్ గాంధీకి కూడా ఫిర్యాదు చేస్తానని ఇందుప్రియ స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Amazon Store | టూ వీలర్ కొనుగోళ్లలో అమెజాన్ స్టోర్ దూకుడు.. చిన్న పట్టణాల నుంచే భారీ డిమాండ్..
- ●Model Arrested | బ్యాంకాక్ నుంచి రూ.11.82 కోట్ల విలువైన గంజాయి స్మగ్లింగ్.. మోడల్ అరెస్ట్
- ●Kane Williamson | షాక్ ఇచ్చిన కేన్ మామ.. సడెన్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై..!
- ●OTT | ఈ వారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు ఇవే - ఈ మలయాళం థ్రిల్లర్ హైలైట్
- ●KTR | రూ. 200 కోట్లతో సీఎం రేవంత్ రాజసౌధం కట్టుకుంటున్నాడు : కేటీఆర్
- ●FIFA 2026 | అట్టహాసంగా మొదలైన ఫిఫా వరల్డ్ కప్.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన మెక్సికో

Amazon Store | టూ వీలర్ కొనుగోళ్లలో అమెజాన్ స్టోర్ దూకుడు.. చిన్న పట్టణాల నుంచే భారీ డిమాండ్..

Model Arrested | బ్యాంకాక్ నుంచి రూ.11.82 కోట్ల విలువైన గంజాయి స్మగ్లింగ్.. మోడల్ అరెస్ట్

Kane Williamson | షాక్ ఇచ్చిన కేన్ మామ.. సడెన్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై..!

OTT | ఈ వారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు ఇవే - ఈ మలయాళం థ్రిల్లర్ హైలైట్





