త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TMC-Congress | కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..? క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్‌

TMC-Congress | టీఎంసీ (TMC)ని కాంగ్రెస్‌ (Congress)లో విలీనం చేసే అవ‌కాశం ఉందంటూ జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని కాంగ్రెస్ తోసిపుచ్చింది. మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల్లో నిజం లేద‌ని తెలిపింది.

D

National | Published On Jun 11, 2026, 4.55 pm IST

TMC-Congress | కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..? క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్‌
Advertisement

TMC-Congress | టీఎంసీ (TMC)ని కాంగ్రెస్‌ (Congress)లో విలీనం చేసే అవ‌కాశం ఉందంటూ జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని కాంగ్రెస్ తోసిపుచ్చింది. మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల్లో నిజం లేద‌ని తెలిపింది. అవ‌న్నీ త‌ప్పుడు క‌థ‌నాలేనని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) స్ప‌ష్ట‌త‌నిచ్చారు. ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, ఆమె మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీతో జాతీయ అంశాల‌పై, ఇండియా కూట‌మి బ‌లోపేతంపైనే చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు తెలిపారు. పార్టీల విలీనంపై ఎలాంటి చ‌ర్చ‌లూ జ‌ర‌గ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

మంగ‌ళ‌వారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)తో మ‌మ‌తా బెన‌ర్జీ స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా బీజేపీ వరుస విజయాలు, టీఎంసీ భ‌విష్య‌త్తు, కూట‌మి రాజ‌కీయాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయ‌డం, ఎంపీలు రాజీనామా వంటి అంశాల‌ను సోనియాకు దీదీ వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా మ‌మ‌తా బెన‌ర్జీకి సోనియా గాంధీ ఓ కీల‌క సూచ‌న చేసిన‌ట్లుగా వార్త‌లు గుప్పుమ‌న్నాయి. టీఎంసీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని మమతను కోరిన‌ట్లు ప్ర‌చారం మొద‌లైంది. టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇస్తామని దీదీకి సోనియా హామీ ఇచ్చినట్లు జాతీయ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో దీనిపై కాంగ్రెస్ తాజాగా క్లారిటీ ఇచ్చింది.

Also Read..

దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ సై! 'నీట్' వివాదం, రాజ్యసభ నామినేషన్ రద్దుపై మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా బిగ్ ప్లాన్

గృహిణుల‌ను కేవ‌లం హోమ్ మేక‌ర్స్‌గా చూడొద్దు.. వారు 'దేశ నిర్మాతలు' : సుప్రీంకోర్టు

5 సెకన్ల‌లో 10 రౌండ్లు.. జిమ్ ఓన‌ర్‌పై బుల్లెట్ల వ‌ర్షం.. షాకింగ్ వీడియో

Advertisement

తాజావార్తలు

Advertisement