Stock Markets | భారీగా పెరిగిన చమురు ధరలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
Stock Markets | అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిని బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కదిలాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్‌లో 35.99 పాయింట్లు పడిపోయి 78,097.31 వద్దకు చేరింది. 50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 31.15 పాయింట్లు తగ్గి 24,444.55 వద్ద ట్రేడైంది.
Stock Markets | అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిని బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కదిలాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్‌లో 35.99 పాయింట్లు పడిపోయి 78,097.31 వద్దకు చేరింది. 50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 31.15 పాయింట్లు తగ్గి 24,444.55 వద్ద ట్రేడైంది. ఆ తర్వాత ట్రేడింగ్‌లో బీఎస్ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 211.37 పాయింట్లు పడిపోయి 77,953.66 వద్దకు చేరగా, నిఫ్టీ 65.10 పాయింట్ల నష్టంతో 24,411.15 వద్ద ట్రేడైంది. సెన్సెక్స్‌లో భారతి ఎయిర్‌టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో కొనసాగాయి.
భారీగా పెరిగిన చమురు ధరలు..
అంతర్జాతీయ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 1.24 శాతం పెరిగి బ్యారెల్‌కు 90.01 డాలర్లకు చేరింది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ 4.59 శాతం ఎగబాకింది. జపాన్‌కు చెందిన నిక్కీ 225, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ సూచీలు కూడా లాభాల్లో ట్రేడయ్యాయి. అయితే హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ సూచీ నష్టాల్లో కొనసాగింది. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మంగళవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.258.55 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేసినట్లు ఎక్స్ఛేంజ్ గణాంకాలు వెల్లడించాయి. ఫారెక్స్ మార్కెట్‌లో గత వారం రోజులుగా బలహీన ప్రదర్శన చేస్తున్న భారత రూపాయి బుధవారం సెషన్‌లో కాస్త బలపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 95.40 వద్ద ఉన్న రూపాయి 0.02 శాతం లాభపడింది.
తాజావార్తలు
- ●August 12 Solar Eclipse 2026 | ఒకే రోజు 4 అరుదైన ఖగోళ వింతలు! ఆకాశంలో 6 గ్రహాల పరేడ్, పరిపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా?
- ●Singareni Apprenticeship | సింగరేణిలో అప్రెంటిస్‌లు.. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, డిప్లొమా చేసినవారు అర్హులు
- ●Constable Suicide | ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్య
- ●Lake Development | CSR నిధులతో చెరువులను అభివృద్ధి చేద్దాం: ఎంఏయూడీ
- ●Cristiano Ronaldo | పదేండ్లుగా డేటింగ్.. ఎట్టకేలకు వివాహబంధంలోకి రొనాల్డో
- ●SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ

August 12 Solar Eclipse 2026 | ఒకే రోజు 4 అరుదైన ఖగోళ వింతలు! ఆకాశంలో 6 గ్రహాల పరేడ్, పరిపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా?

Singareni Apprenticeship | సింగరేణిలో అప్రెంటిస్‌లు.. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, డిప్లొమా చేసినవారు అర్హులు

Constable Suicide | ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్య

Lake Development | CSR నిధులతో చెరువులను అభివృద్ధి చేద్దాం: ఎంఏయూడీ






