త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Israel Strikes On Lebanon | లెబ‌నాన్‌పై మ‌ళ్లీ విరుచుకుప‌డిన ఇజ్రాయెల్‌.. 16 మంది మృతి

Israel Strikes On Lebanon | లెబ‌నాన్‌పై ఇజ్రాయెల్ మ‌రోసారి విరుచుకుప‌డింది. రాత్రి వేళ‌ల్లో ప‌లు ప్రాంతాల‌ను ల‌క్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. ఈ దాడుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

D

International | Published On Jun 19, 2026, 12.18 pm IST

Israel Strikes On Lebanon | లెబ‌నాన్‌పై మ‌ళ్లీ విరుచుకుప‌డిన ఇజ్రాయెల్‌.. 16 మంది మృతి
Advertisement

Israel Strikes On Lebanon | అగ్ర‌రాజ్యం అమెరికాకు ఇజ్రాయెల్ షాకిచ్చింది. లెబ‌నాన్‌పై ఇజ్రాయెల్ మ‌రోసారి విరుచుకుప‌డింది. అమెరికా-ఇరాన్ మ‌ధ్య శాంతి ఒప్పందం (US Iran peace agreement) కుదిరిన కొన్ని గంట‌ల‌కే లెబ‌నాన్‌పై వైమానిక దాడుల‌తో విరుచుకుప‌డింది. ఈ దాడుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయ‌డ్డారు.

ఈ దాడుల‌ను ఇజ్రాయెల్ సైన్యం సైతం ధృవీక‌రించింది. రాత్రి వేళ‌ల్లో ప‌లు ప్రాంతాల‌ను ల‌క్ష్యంగా చేసుకొని దాడులు చేసిన‌ట్లు తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లు (Hezbollah militants), వారి మౌలిక స‌దుపాయాలే ల‌క్ష్యంగా దాడులు చేసిన‌ట్లు పేర్కొంది. ఇరాన్ మ‌ద్ద‌తు ఉన్న ఈ గ్రూప్ ప‌దేప‌దే కాల్పుల విర‌మ‌ణ‌ను ఉల్లంఘించినందుకు ప్ర‌తిస్పంద‌న‌గానే ఈ దాడులు చేసిన‌ట్లు వెల్ల‌డించింది.

కాగా, నబాతియే నగరంతోపాటు కఫర్ జౌజ్, కఫర్ రెమాన్, జెబ్డైన్ చుట్టుపక్కల అనేక పట్టణాల్లో ఈ దాడులు జరిగినట్లు అంతర్జాతీయ వార్త ఏజెన్సీలు తెలిపాయి. ఆ తర్వాత వరుస వైమానిక దాడులు కఫర్ టిబ్నిట్, రేహాన్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో జరిగినట్లు తెలిపాయి. ఇజ్రాయెల్‌ జరిపిన ఈ దాడుల కారణంగానే అమెరికా-ఇరాన్ మధ్య జెనీవాలో శుక్రవారం జరగాల్సిన చర్చలు వాయిదాపడినట్లు తెలుస్తోంది.

యూఎస్‌-ఇరాన్ మ‌ధ్య కుద‌రిని శాంతి ఒప్పందంలో లెబనాన్‌ అంశాన్ని కూడా చేర్చిన విష‌యం తెలిసిందే. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్లను తక్షణమే ముగించి.. ఆ ప్రాంతాన్ని వీడాలని ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే, ఈ ఒప్పందాన్ని ప‌క్క‌న పెట్టి ఇజ్రాయెల్ దాడుల‌కు దిగ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజా దాడుల‌తో మ‌రోసారి మ‌ధ్య‌ప్రాచ్యంలో ఉద్రిక్త ప‌రిస్థితులు తలెత్తాయి.

Also Read..

రాహుల్‌కు ప్ర‌ధాని మోదీ బ‌ర్త్‌డే విషెస్‌

జన్ జడ్ ఆకాంక్షల మేర‌కు రాహుల్ ప్ర‌ధాని కావాలి : మంత్రి పొన్నం

టెలిగ్రామ్‌పై నిషేధం స‌రైన నిర్ణ‌య‌మే : ఢిల్లీ హైకోర్టు

Advertisement
Advertisement