త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | స్నేక్ చార్మర్‌గా ప్ర‌ధాని మోదీ.. వివాదాస్ప‌ద కార్టూన్ వేసిన నార్వే ప‌త్రిక‌

PM Modi | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)పై నార్వేకి చెందిన ఓ ప‌త్రిక విష‌యం క‌క్కింది. మోదీని పాములు ఆడించే వ్య‌క్తిగా (స్నేక్ చార్మర్) చిత్రీకరిస్తూ కార్టూన్ (cartoon) రూపొందించింది.

D

National | Published On May 20, 2026, 1.32 pm IST

PM Modi | స్నేక్ చార్మర్‌గా ప్ర‌ధాని మోదీ.. వివాదాస్ప‌ద కార్టూన్ వేసిన నార్వే ప‌త్రిక‌
Advertisement

PM Modi | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)పై నార్వేకి చెందిన ఓ ప‌త్రిక విష‌యం క‌క్కింది. మోదీని పాములు ఆడించే వ్య‌క్తిగా (స్నేక్ చార్మర్) చిత్రీకరిస్తూ కార్టూన్ (cartoon) రూపొందించింది. నార్వేకు చెందిన అఫ్టెన్‌పోస్ట‌న్ అనే ప‌త్రిక ఈ వివాదాస్ప‌ద కార్టూన్ (snake charmer) వేసింది. ఆ కార్టూన్‌కు తెలివైన, తిక‌మ‌క‌పెట్టే వ్య‌క్తి అన్న ఉద్దేశంతో వ‌చ్చేలా శీర్షిక పెట్టింది. అందులో ప్ర‌ధాని మోదీ పుంగీ ఊదుతుండ‌గా, బుట్ట‌లో ఉన్న పాము లేచి ఆడుతోంది. అయితే ఆ పామును ఓ గ్యాస్ స్టేష‌న్ ఫిల్లింగ్ పైప్‌గా కార్టూన్‌లో చిత్రీక‌రించారు.

కాగా, ఐదు దేశాల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నార్వే (Norway)ను విజిట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా స‌ద‌రు ప‌త్రిక వివాదాస్ప‌ద కార్టూన్‌ను వేసింది. దీనిపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. స‌ద‌రు ప‌త్రిక‌పై నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ కార్టూన్ పాతకాలపు భారత వ్యతిరేక మూసధోరణులను ప్రతిబింబిస్తోందని, ఇది భారత్‌ను, దేశ ప్రధానిని అవమానించడమేనని నెటిజన్లు మండిపడుతున్నారు. నార్వే జాతివివ‌క్ష‌ను ప్ర‌ద‌ర్శించిందంటూ ఆరోపిస్తున్నారు.

Also Read..

టెట్రా ప్యాక్‌లు, సాచెట్లలో మద్యం అమ్మకాలు.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి : సుప్రీంకోర్టు

ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్‌ దూకుడుకు అమెరికా సెనేట్‌ బ్రేక్

Advertisement
Advertisement