Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం
Road Accident | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
Road Accident | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లఖింపూర్-బహరైచ్ జాతీయ రహదారి (NH-730)పై ఈసానగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ ప్యాసింజర్ వాహనం, ట్రక్కు బలంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో ఉంచ్ గ్రామం-భరేహ్తా మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మ్యాజిక్ వాహనం సరకు రవాణా ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు పురుషులు కాగా, ఇద్దరు మహిళలు ఉన్నారు.
ప్రమాద సమాచారం అందగానే స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమారియాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు (CHC) తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిని మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో ఆ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Also Read..
దక్షిణాదిలో బీజేపీకి అడ్డుకట్ట వేశాం : సీఎం రేవంత్ రెడ్డి
బండి భగీరథ్‌పై మరో సెక్షన్.. నేరం రుజువైతే పదేండ్లు జైలు!
సంబంధిత వార్తలు

Karnataka | లారీని ఢీకొట్టిన మినీ ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం
జులై 9, 2026

Road Accident | బస్టాప్‌లో నిల్చున్న వారిపైకి దూసుకెళ్లిన బొలెరో.. ఇద్దరు మహిళలు దుర్మరణం
జులై 9, 2026

Electric Shocks | తాగొచ్చి గొడవ చేస్తున్నాడని.. భర్తను మంచానికి కట్టేసి కొట్టి.. కరెంటు షాక్ పెట్టి చిత్రహింసలు..
జులై 8, 2026
తాజావార్తలు
- ●Rajpal Yadav | చెక్‌బౌన్స్ కేసు.. నటుడికి మూడు నెలల జైలు శిక్ష
- ●Gandra Venkataramana Reddy | కుంటిసాకులు బంద్ చేసి కన్నేపల్లి పంపులు ఆన్ చేయాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర
- ●Lenin Review | లెనిన్ రివ్యూ - అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే బోణీ కొట్టారా? లేదా?
- ●MP Chamala Kiran Kumar Reddy | తుంగతుర్తిది మా ఇంటి సమస్య.. మాకేం పంచాయితీల్లేవ్
- ●Health Insurance | హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మార్చుకోవచ్చా.. రూల్స్ ఎలా ఉన్నాయి..
- ●CM Vijay | కరూర్ ఘటన పక్కా కుట్ర.. సిగ్గులేకుండా నాపై నిందలేశారు : సీఎం విజయ్

Rajpal Yadav | చెక్‌బౌన్స్ కేసు.. నటుడికి మూడు నెలల జైలు శిక్ష

Gandra Venkataramana Reddy | కుంటిసాకులు బంద్ చేసి కన్నేపల్లి పంపులు ఆన్ చేయాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర

Lenin Review | లెనిన్ రివ్యూ - అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే బోణీ కొట్టారా? లేదా?

MP Chamala Kiran Kumar Reddy | తుంగతుర్తిది మా ఇంటి సమస్య.. మాకేం పంచాయితీల్లేవ్



