Rajpal Yadav | చెక్‌బౌన్స్ కేసు.. నటుడికి మూడు నెలల జైలు శిక్ష
Rajpal Yadav | చెక్ బౌన్స్ కేసు (cheque bounce case)లో బాలీవుడ్ నటుడు, కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ (Rajpal Yadav)కు మరోసారి జైలు శిక్ష పడింది.
Rajpal Yadav | చెక్ బౌన్స్ కేసు (cheque bounce case)లో బాలీవుడ్ నటుడు, కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ (Rajpal Yadav)కు మరోసారి జైలు శిక్ష పడింది. ఈ కేసులో నటుడు దోషే అని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) తేల్చి చెప్పింది. వివాదాన్ని పరిష్కరించుకుంటానని పదేపదే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఆయన విఫలమయ్యారని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు రాజ్‌పాల్ యాదవ్‌కు మూడు నెలలు జైలు శిక్ష విధించింది. మొత్తం ఏడు కేసుల్లో ఒక్కో దానికి మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. ఈ శిక్షలన్నీ ఒకేసారి అమలవుతాయని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తీర్పు చెప్పారు.
ఈ కేసులో మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన న్యాయస్థానం.. గతంలో సెషన్స్ కోర్టు విధించిన శిక్షను సవరించింది. ఈ ఏడు కేసుల్లో ఒక్కో కేసులో ఫిర్యాదుదారుడికి రూ. 1.05 కోట్ల చొప్పున చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీనికి అదనంగా ఒక్కో ఫిర్యాదు దారుడికి రూ.1.04 లక్షలు, ప్రభుత్వానికి రూ. 25,000 చెల్లించాలని ఆదేశించింది. ఇప్పటికే అతను చెల్లించిన రూ. 2 కోట్ల మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.
ఒక సినిమా నిర్మాణం కోసం మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి రాజ్‌పాల్ యాదవ్, ఆయన భార్య కొంత రుణం తీసుకున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతోపాటూ వారు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవ్వడంతో సదరు సంస్థ రాజ్‌పాల్ యాదవ్‌పై కేసు పెట్టింది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ మెజిస్ట్రేట్ కోర్టు రాజ్‌పాల్ దంపతులను 2018లో దోషులుగా తేల్చింది. నటుడికి ఆరు నెలలు జైలు శిక్ష కూడా విధించింది. ఆ తర్వాత 2019లో సెషన్స్ కోర్టు కూడా ఈ శిక్షను సమర్థించింది. దీనిని సవాలు చేస్తూ రాజ్‌పాల్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదుదారుడికి డబ్బు తిరిగి చెల్లిస్తానని నటుడు కోర్టుకు హామీ ఇచ్చారు. అయితే, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమవడంతో ఈ ఏడాది ఫ్రిబ్రవరిలో కోర్టులో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన తీహార్ జైలులో లొంగిపోయారు.
ఫిర్యాదుదారుడైన మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.1.5 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసిన తర్వాత, కోర్టు ఆయన శిక్షను మార్చి 18 వరకు నిలిపివేస్తూ విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఫిబ్రవరి 16న నటుడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో పదిరోజులు శిక్ష అనుభవించిన ఆయన బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. కోర్టు తీర్పుతో ఇప్పుడు మళ్లీ జైలుకెళ్లనున్నారు.
సంబంధిత వార్తలు

Abhishek Sharma | అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ఆ పోస్టులు తొలగించేందుకు ఉత్తర్వులిస్తామన్న కోర్టు
జులై 9, 2026

Kalvakuntla Kavitha New Party | ఢిల్లీ హైకోర్టులో కవితకు భారీ షాక్.. ‘టీఆర్ఎస్’ పార్టీకి బ్రేక్
జులై 7, 2026

CJPs X handle | కాక్రోచ్ పార్టీ ఎక్స్ ఖాతాపై బ్యాన్ ఎత్తివేయాలంటూ కోర్టు ఆదేశం
జులై 7, 2026
తాజావార్తలు
- ●MP Chamala Kiran Kumar Reddy | తుంగతుర్తిది మా ఇంటి సమస్య.. మాకేం పంచాయితీల్లేవ్
- ●Health Insurance | హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మార్చుకోవచ్చా.. రూల్స్ ఎలా ఉన్నాయి..
- ●CM Vijay | కరూర్ ఘటన పక్కా కుట్ర.. సిగ్గులేకుండా నాపై నిందలేశారు : సీఎం విజయ్
- ●Medipally Satyam | అసలు పిచ్చి లేసింది హరీశ్‌రావుకే.. ఆయనకు రేవంత్ ఫోబియా పట్టుకుంది
- ●ChatGPT Work | చాట్ జీపీటీ వర్క్ మోడల్ వచ్చేసింది.. ఇక గంటల తరబడి ఏఐని వాడవచ్చు..
- ●Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీకి వెరైటీ టైటిల్ ఫిక్స్ - నాలుగు భాషల్లో రిలీజ్

MP Chamala Kiran Kumar Reddy | తుంగతుర్తిది మా ఇంటి సమస్య.. మాకేం పంచాయితీల్లేవ్

Health Insurance | హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మార్చుకోవచ్చా.. రూల్స్ ఎలా ఉన్నాయి..

CM Vijay | కరూర్ ఘటన పక్కా కుట్ర.. సిగ్గులేకుండా నాపై నిందలేశారు : సీఎం విజయ్

Medipally Satyam | అసలు పిచ్చి లేసింది హరీశ్‌రావుకే.. ఆయనకు రేవంత్ ఫోబియా పట్టుకుంది



