Karnataka | లారీని ఢీకొట్టిన మినీ ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం
Karnataka | కర్ణాటకలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తీర్థయాత్రకు బయల్దేరిన ఓ మినీ ట్రక్కు.. అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
Karnataka | త్రినేత్ర.న్యూస్ : కర్ణాటకలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తీర్థయాత్రకు బయల్దేరిన ఓ మినీ ట్రక్కు.. అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ధార్వడ్‌కు నుంచి ధర్మస్థలకు మినీ ట్రక్కులో డ్రైవర్‌తో సహా 9 మంది బయల్దేరారు. డ్రైవర్ సంజీవ్ అతి వేగంగా ట్రక్కును నడిపించాడు. గురువారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఉత్తర కన్నడ జిల్లాలోని అరబెయిల్ ఘాట్ సెక్షన్‌లో మినీ ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న యెల్లాపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుబ్బలిలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత వార్తలు

Road Accident | బస్టాప్‌లో నిల్చున్న వారిపైకి దూసుకెళ్లిన బొలెరో.. ఇద్దరు మహిళలు దుర్మరణం
జులై 9, 2026

Priyank Kharge | ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు వచ్చినప్పుడల్లా ప్రధాని విదేశాలకు వెళ్తారు : ప్రియాంక్ ఖర్గే
జులై 8, 2026

Daughter Killed Mother | సర్కారు కొలువు కోసం కన్నతల్లి హత్య.. రూ.7 లక్షల సుపారీ..
జులై 8, 2026
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..



