MP Chamala Kiran Kumar Reddy | తుంగతుర్తిది మా ఇంటి సమస్య.. మాకేం పంచాయితీల్లేవ్
MP Chamala Kiran Kumar Reddy | తుంగతుర్తిది మా ఇంటి సమస్య అని.. అక్కడ మాకేం పంచాయితీలు లేవని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తుంగతుర్తిలో నా పెత్తనం ఏమీ లేదన్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ నా సోదరుడు అని చెప్పారు. మండల కమిటీ అధ్యక్షుల విషయంలో అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకుంటే బాగుండు అని తాను చెప్పినట్లు వివరించారు.
- అక్కడ నా పెత్తనం ఏం లేద్.. మందుల సామేల్ నా సోదరుడు
- పదవుల విషయంలో అందరినీ సంప్రదిస్తే బాగుండు అన్నాను
- ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి
MP Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్: తుంగతుర్తిది మా ఇంటి సమస్య అని.. అక్కడ మాకేం పంచాయితీలు లేవని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తుంగతుర్తిలో నా పెత్తనం ఏమీ లేదన్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ నా సోదరుడు అని చెప్పారు. మండల కమిటీ అధ్యక్షుల విషయంలో అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకుంటే బాగుండు అని తాను చెప్పినట్లు వివరించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై విమర్శలు చేశారు.
తుంగతుర్తి సమస్యను సద్దు మణిగించాలని భావించాను. నేను కాంగ్రెస్ కార్యకర్తను. మన గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలి. కూర్చొని అందరితో మాట్లాడి పదవులు ఇవ్వమని మందుల సామెలును అడిగాను. తుంగతుర్తిలో నా పెత్తనం ఏమీ లేదు అని ఎంపీ చామల స్పష్టం చేశారు.
కేటీఆర్ కలలు కంటున్నడు..
భారాస పార్టీ భరోసా లేని పార్టీగా మారింది. క్యాడర్‌ను కాపాడుకోవడానికి కేటీఆర్ సొల్లు కబుర్లు చెబుతున్నారు. కేటీఆర్ కలలు కంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కల కంటున్నాడు. సినిమా వాళ్ల ఫోన్లు వింటున్నట్టు కూడా కలలు కంటున్నాడు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో కూడా సర్వేలో తామే ఉన్నామని కేటీఆర్ అన్నాడు. ఏమైంది?
కంటోన్మెంట్, జూబ్లిహిల్స్ సిట్టింగ్ స్థానాలను బీఆర్ఎస్ కోల్పోయింది అని చామల ఎద్దేవా చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్
- ●HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..

CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ






