Electric Shocks | తాగొచ్చి గొడవ చేస్తున్నాడని.. భర్తను మంచానికి కట్టేసి కొట్టి.. కరెంటు షాక్ పెట్టి చిత్రహింసలు..
Electric Shocks | మద్యానికి బానిసైన భర్త.. రోజూ తాగొచ్చి గొడవ చేస్తున్నాడు. విసిగిపోయిన భార్య.. అతడిని మంచానికి కట్టేసి చితకబాదింది. ఆపై కరెంటు షాకు (Electric Shocks) పెట్టి చిత్రహింసలకు గురిచేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఫతేపూర్ జిల్లాలో జరిగింది.
Electric Shocks | త్రినేత్ర.న్యూస్: మద్యానికి బానిసైన భర్త.. రోజూ తాగొచ్చి గొడవ చేస్తున్నాడు. విసిగిపోయిన భార్య.. అతడిని మంచానికి కట్టేసి చితకబాదింది. ఆపై కరెంటు షాకు (Electric Shocks) పెట్టి చిత్రహింసలకు గురిచేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఫతేపూర్ జిల్లాలో జరిగింది.
ఫతేపూర్ జిల్లాకు చెందిన సంజీవ్ తివారీ (Sanjeev Tiwari) మద్యానికి (Alcohol) అలవాటు పట్టాడు. రోజూ పూటుగా తాగొచ్చి భార్యతో గొడవపడే వాడు. ఆదివారం రాత్రి కూడా దంపతుల మధ్య మద్యం విషయమై వాదోపవాదలు జరిగాయి. ఈ క్రమంలో చిర్రెత్తుకొచ్చిన ఆమె.. భర్త సంజీవ్‌ను ఓ మంచానికి (Cot) కట్టేసింది. కర్రతో విచక్షణా రహితంగా (Assaulted) కొట్టింది. అంతటితో ఆగకుండా విద్యుత్ వైర్లతో (Electric Wires) అతనికి కరెంట్ షాక్ పెట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉందయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అనంతరం బాధితుడిని జిల్లా దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం కాన్పూర్‌కు (Kanpur) తరలించారు. కాస్త కోలుకున్న అతడు.. తన భార్యే తనని మంచానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేసిందని, కరెంటు షాక్ కూడా పెట్టిందని చెప్పారు. బాధితుని సోదరుడి ఫిర్యాదుతో ఆ మహిళపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురానికి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సంజీవ్ తివారి ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడిందని చెప్పారు.
తాజావార్తలు
- ●Kalwakuntla Kavitha | అనుముల కాదు! ఆయన ఆంధ్రా రేవంత్‌రెడ్డి.. అందుకే బ్రాహ్మణ పరిషత్ ఛైర్మన్ పదవి శ్రీనివాసరావుకు కట్టబెట్టిండు
- ●Ananya Panday | ప్రియుడితో బ్రేకప్ - రెండేళ్ల ప్రేమ బంధానికి లైగర్ హీరోయిన్ గుడ్‌బై
- ●TG Govt | పెట్రోల్, డీజిల్ ఆటోలకు చెక్.. ఈవీలుగా మార్చేందుకు రూ.200 కోట్లతో సర్కారు కొత్త పథకం
- ●PM Modi | 2036 ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి
- ●Nepal Flash Floods | నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు : విదేశాంగ శాఖ
- ●Gold Import Duty | పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్..? బంగారంపై సుంకాన్ని తగ్గించే యోచనలో కేంద్రం..?

Kalwakuntla Kavitha | అనుముల కాదు! ఆయన ఆంధ్రా రేవంత్‌రెడ్డి.. అందుకే బ్రాహ్మణ పరిషత్ ఛైర్మన్ పదవి శ్రీనివాసరావుకు కట్టబెట్టిండు

Ananya Panday | ప్రియుడితో బ్రేకప్ - రెండేళ్ల ప్రేమ బంధానికి లైగర్ హీరోయిన్ గుడ్‌బై

TG Govt | పెట్రోల్, డీజిల్ ఆటోలకు చెక్.. ఈవీలుగా మార్చేందుకు రూ.200 కోట్లతో సర్కారు కొత్త పథకం

PM Modi | 2036 ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి






