Lenin Review | లెనిన్ రివ్యూ – అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే బోణీ కొట్టారా? లేదా?
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లెనిన్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తండ్రి నాగార్జున నిర్మించిన ఈ సినిమాతో కొడుకు అఖిల్‌కు హిట్టు దక్కిందా? లేదా? అంటే? భారతం మిట్ట జాతర...
Entertainment | Published On Jul 10, 2026, 3.30 pm IST
Lenin Review | అఖిల్ అక్కినేని హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదమూడేళ్లు దాటిపోయింది. ఇప్పటివరకు హిట్టు మాత్రం దక్కలేదు. సక్సెస్ కోసం తన పంథాను మార్చిన అఖిల్ ఫస్ట్ టైమ్ పల్లెటూరి కథతో లెనిన్ సినిమా చేశాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వం వహించాడు. హీరో నాగార్జున, సూర్య దేవర నాగవంశీ కలిసి నిర్మించిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. లెనిన్ ఎలా ఉందంటే?
భారతం మిట్ట జాతర
శ్రీ రామాపురానికి చెందిన లెనిన్ (అఖిల్) ఓ మర్డర్ కేసులో జైలు నుంచి రిలీజవుతాడు. అతడి కారణంగానే ఊళ్లో జరిగే భారతం మిట్ట జాతర ఆగిపోతుంది. పద్దెనిమిది రోజుల పాటు జరిగే ఆ జాతరలో రక్తం నేల చిందకూడదని ఆచారం ఉంటుంది. శత్రువుల పన్నాగాల కారణంగా ఆ జాతర కట్టుబాటును లెనిన్ తప్పుతాడు. అలా ఎందుకు జరిగింది? జాతరలో లెనిన్ ఎవరిని చంపాడు? జైలు నుంచి రిలీజైన లెనిన్ తన ప్రాణ స్నేహితుడు వసంత్‌తో (ప్రమోద్ పంజు) పాటు అతడి చిన్నాన్న యతిరాజు (శివాజీ) వెతుక్కుంటూ ఆ ఊరికి ఎందుకొచ్చాడు? లెనిన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భారతి (భాగ్యశ్రీ బోర్సే) అతడికి ఎలా దూరమైంది? వసంత్ కుటుంబం కోసం ఎమ్మెల్యేతో పాటు దామోదరంతో లెనిన్ ఎందుకు గొడవలు పడ్డాడు? అన్నదే ఈ మూవీ కథ.
మహాభారతం...
మహాభారతం ధర్మం, అధర్మం మధ్య సంఘర్షణకు ప్రతీకగా నిలుస్తుంది. ద్రౌపదితో పాటు పాండవులపై ద్వేషంతో వారిపై కుట్రలు, కుతంత్రాలు చేస్తారు కౌరవులు. వెన్నుపోటు పొడుస్తారు. కౌరవుల కుట్రల వల్ల చివరకు పాండవులు అజ్ఞాతవాసం చేయాల్సివస్తుంది. చివరకు కురుక్షేతంలో బంధుప్రీతిని పక్కనపెట్టి తమ సోదరులు, ఆప్తులతోనే పాండవులు యుద్ధం చేసి గెలుస్తారు.
ఈ మహాభారతం కథ నుంచే ఇన్‌స్పైర్ అయ్యి దర్శకుడు లెనిన్ మూవీ స్టోరీని రాసుకున్నారు డైరెక్టర్. ఈ సినిమాలో కనిపించే ప్రతి క్యారెక్టర్ భారతంలోని పాత్రలను పోలి ఉంటాయి. మహాభారతాన్ని నేటి తరానికి అన్వయిస్తూ సినిమాగా మలిచారు. భారతం మిట్ట అనే జాతర బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమ, యాక్షన్ రివేంజ్ అంశాలతో ఈ సినిమా సాగుతుంది. నమ్మిన వాళ్లు ఓ యువకుడికి ఎలా వచించారు? తనకు జరిగిన అన్యాయంపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే ఈ సినిమా మెయిన్ ఫ్లాట్.
ట్విస్ట్‌లు సూపర్...
ఫస్ట్ హాఫ్ హీరోహీరోయిన్ల ప్రేమకథతో సరదాగా సినిమా సాగుతుంది. జాతర నేపథ్యంలో వారి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటాయి. మరోవైపు ఎమ్మెల్యేతో లెనిన్ గొడవ, జయంతి పాత్రలో వచ్చే ట్విస్ట్‌లతో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెంచారు. లెనిన్ అసలు శత్రువు ఎవరన్నది బయటపడే సీన్ బాగుంది. క్లైమాక్స్‌లో అఖిల్ పాత్రకు సంబంధించి వచ్చే ట్విస్ట్ వర్కవుట్ అయ్యింది.
అల్లు అర్జున్ పుష్ప...
లెనిన్ కోసం దర్శకుడు ఎంచుకున్న కథతో తెలుగు తెరపై వందల సినిమాలొచ్చాయి. కథకు కీలకమైన రెండు ట్విస్ట్‌లు ప్రెడిక్టబుల్‌గా ఉన్నాయి. పుష్ప సినిమా ఛాయలు సినిమాలో చాలానే కనిపిస్తాయి. జాతరలో విలన్ ఆడవేషం వేసే సీన్ పుష్ప సినిమాను గుర్తుకు తెస్తుంది.
మ్యూజిక్ మైనస్...
లవ్ స్టోరీకి మ్యూజిక్ బలం. లెనిన్‌కు అదే మైనస్‌గా మారింది. తమన్ పాటల్లో ఒక్కటి ఆకట్టుకునేలా లేవు. వాటి ప్లేస్‌మెంట్ సరిగా లేదు. చిత్తూరు యాస, భాషలు కొంత వరకు సినిమాకు ప్రెష్‌నెస్‌ను తీసుకొచ్చాయి. లెనిన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారన్నది సరైన జస్టిఫికేషన్ లేవు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో మొదలైన తీరు బాగుంది.
పల్లెటూరి అమ్మాయిలా...
అఖిల్ నటనలో పరిణతి కనిపించింది. డ్యాన్సుల్లో, డైలాగ్ డెలివరీ ఇంప్రూవ్ అయ్యాడు. ఎమోషనల్ సీన్లలో మాత్రం తెలిపోయాడు. జాతర ఎపిసోడ్‌లో అతడి నటన కన్వీన్సింగ్‌గా లేదు. భారతి పాత్రలో ఒదిగిపోయింది భాగ్యశ్రీ బోర్సే. అచ్చం పల్లెటూరి అమ్మాయిలానే కనిపించింది. ఆమె డబ్బింగ్‌లో అక్కడక్కడ నేటివిటీ మిస్సయ్యింది. మంచివాడిగా కనిపించే విలన్ పాత్రకు ప్రదీప్ పంజు న్యాయం చేశాడు. శివాజీ, ఈశ్వరీరావు నెగెటివ్ షేడ్స్‌తో మెప్పించారు. గెటప్ శ్రీను, ప్రవీణ్, రంగస్థలం మహేష్‌తో పాటు సినిమాలు చాలా మందే కమెడియన్లు ఉన్నారు. కానీ వారికి ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా ఉండవు.
డైరెక్టర్ ఎంచుకున్న స్టోరీలో, తీసిన విధానంలో కొత్తదనం లేదు. మహాభారతం డైలాగ్స్ ఓ స్టేజ్ వరకు ఓకే అనిపస్తాయి. అవసరమైన చోట కూడా పెట్టడంతో కావాలనే ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. కొడుకు సినిమా అయినా నాగార్జున మాత్రం పెద్దగా ఖర్చుపెట్టలేదు. లిమిటెడ్ బడ్జెట్‌లోనే సినిమాను కంప్లీట్ చేశారు.
లెనిన్ టైటిల్‌లో ఉన్న కొత్తదనం సినిమాలో లేదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tollywood | మైథలాజికల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ కమెడియన్
ఆగస్టు 24, 2026

Aishwarya Lekshmi | అల్లు అర్జున్ రాకాలో లేడీ విలన్‌గా మలయాళం హీరోయిన్
ఆగస్టు 24, 2026

Rashmika Mandanna | ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి వేడుకలో విజయ్ , రష్మిక – గాయం నుంచి కోలుకున్న నేషనల్ క్రష్
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?
- ●Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ
- ●Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000
- ●Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
- ●Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..

One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?

Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ

Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000

Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య



