Gandra Venkataramana Reddy | కుంటిసాకులు బంద్ చేసి కన్నేపల్లి పంపులు ఆన్ చేయాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Gandra Venkataramana Reddy | రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిప్పులు చెరిగారు. కుంటిసాకులు బంద్ చేసి కన్నేపల్లి పంపులు ఆన్ చేయాలని సూచించారు.
Gandra Venkataramana Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిప్పులు చెరిగారు. కుంటిసాకులు బంద్ చేసి కన్నేపల్లి పంపులు ఆన్ చేయాలని సూచించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం గండ్ర వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
దేశ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు నిరాశాజనకంగా కనిపిస్తున్నాయి. ప్రతి చినుకును కాపాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం చేస్తుంది. తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన కేసీఆర్ చేశారు. దురదృష్టవశాత్తు మేడిగడ్డలో రెండు పిల్లర్లు రిపేర్ వస్తే... రిపేర్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. మేడిగడ్డను ఎల్ అండ్ టీ రిపేర్ చేస్తామని చెప్పిన, ఈ ప్రభుత్వం అడ్డుకుంది. పంపులు ఆన్ చేయమని రిటైర్డ్ ఇంజినీర్లు చెప్తున్న ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు అని గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు.
రైతులకు ఉండే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదు..
రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లు.. కాబట్టే రైతుల ప్రయోజనాలు అర్దం కావడం లేదు. రాజకీయ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకోవద్దని మా విజ్ఞప్తి. రేవంత్ రెడ్డి పనిచేస్తే అడ్డుకున్నది ఎవరు.. ఆయన మంచి పనులు చేస్తే కదా..! రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు, ఆయన చేసిన మంచి పనులు ఒక్కటి లేవు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతగాక ఢిల్లీ చుట్టు తిరుగుడే సరిపోతుంది. పరిస్థితులు ఇలానే ఉంటే హైదరాబాద్‌కు తాగునీటికి కష్టం అవుతుంది. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్లనే దేవాదుల కింద పంట పొలాలు ఎండిపోయాయి. జూన్‌లో దేవాదుల ప్రాజెక్టు పంపులు ఆన్ చేస్తే రైతులకు మేలు జరిగేది. రైతులకు ఉండే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ ఉద్దేశ్యం ఏంటో రైతులకు అర్థం కావడం లేదు, రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీతో కవితకు ఇంటర్నల్ అండర్ స్టాండింగ్..
కవిత ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతుంది, ఆమె మాటల్లో వాస్తవం లేదు, పస లేదు. భారతదేశంలో అనేక పార్టీలు ఉన్నాయి , ప్రతి పార్టీ ఫండ్ కలెక్ట్ చేసుకుంటుంది. ఆయా పరిస్థితులను బట్టి పార్టీలు ఫండ్ కలెక్ట్ చేసుకుంటాయి. అమరవీరులను గుర్తించిందే కేసీఆర్, వారిని ఆదుకోని ఉద్యోగాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోవడంతోనే ఎంతో మంది అమరులయ్యారు. కవితకు ఎంతసేపు బిఆర్ఎస్ పార్టీనే కనిపిస్తుంది, కాంగ్రెస్ ఎందుకు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీతో కవితకు ఏదో ఇంటర్నల్ అండర్ స్టాండింగ్.. అందుకే కాంగ్రెస్ పార్టీని కవిత విమర్శించడం లేదు. దేశంలో ఎక్కడ లేనివిధంగా అమరవీరుల స్థూపం కట్టింది కేసీఆర్ అని గండ్ర వెంకటరమణారెడ్డి గుర్తు చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Tummala Nageshwar Rao | రైతు భరోసా పథకం కింద 30 నెలల్లోనే.. రూ. 36 వేల కోట్లు జమ : మంత్రి తుమ్మల
- ●WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ల బర్త్ డేలను ముందే చెబుతుంది..
- ●Sreeleela | సోషల్ మీడియాలో శ్రీలీల రేంజ్ మామూలుగా లేదుగా.. ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు ఎంత డిమాండ్ చేస్తుందంటే?
- ●Sridhar Babu | తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేలా చూడండి
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లు లాభం..
- ●Mahesh Kumar Goud | హరీశ్‌రావు మా పార్టీలోకి వస్తానంటే చర్చిస్తాం : మహేశ్ కుమార్ గౌడ్

Tummala Nageshwar Rao | రైతు భరోసా పథకం కింద 30 నెలల్లోనే.. రూ. 36 వేల కోట్లు జమ : మంత్రి తుమ్మల

WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ల బర్త్ డేలను ముందే చెబుతుంది..

Sreeleela | సోషల్ మీడియాలో శ్రీలీల రేంజ్ మామూలుగా లేదుగా.. ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు ఎంత డిమాండ్ చేస్తుందంటే?

Sridhar Babu | తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేలా చూడండి




