Air India Flight | ఫైర్ వార్నింగ్.. ముంబైకి రావాల్సిన విమానం సౌదీకి మళ్లింపు
Air India Flight | న్యూయార్క్ నుంచి ముంబై (New York To Mumbai Flight) వస్తున్న ఎయిర్ ఇండియా విమానం (Air India Flight)లో సాంకేతిక సమస్య తలెత్తింది. కాక్‌పిట్‌లో కార్గో ఫైర్ అంటూ వార్నింగ్ వచ్చింది.
Air India Flight | న్యూయార్క్ నుంచి ముంబై (New York To Mumbai Flight) వస్తున్న ఎయిర్ ఇండియా విమానం (Air India Flight)లో సాంకేతిక సమస్య తలెత్తింది. కాక్‌పిట్‌లో కార్గో ఫైర్ అంటూ వార్నింగ్ వచ్చింది. ఈ వార్నింగ్‌తో (Fire Indication) అప్రమత్తమైన పైలట్ వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత విమానాన్ని సౌదీ అరేబియా ( Saudi Arabia)కు మళ్లించారు.
AI116 (బోయింగ్ 777) విమానం గురువారం ముంబైకి రావాల్సి ఉంది. అయితే, విమానం గాల్లో ఉండగా వెనుక భాగంలోని కార్గో విభాగంలో మంటలు చెలరేగినట్లు కాక్‌పిట్‌లోని (cockpit) సెన్సార్లు హెచ్చరించాయి. ఈ హెచ్చరికలతో విమానాన్ని సౌదీలోని మదీనాకు మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అక్కడ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫైర్ వార్నింగ్ తప్పుడు హెచ్చరికలుగా గుర్తించారు. కార్గో విభాగంలో మంటలు ఏమీ చెలరేగలేదని అధికారులు ధృవీకరించారు. తనిఖీల అనంతరం విమానం ముంబైకి బయల్దేరినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఆ సమయంలో విమానంలో ఎంత మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారన్నదానిపై క్లారిటీ లేదు. విమానంలోని వారంతా సురక్షితంగానే ఉన్నట్లు ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు.
Also Read..
హర్మూజ్‌ను తెరిపించేందుకు రంగంలోకి దిగిన యూరోపియన్ దేశాలు
ఇరాన్‌తో యుద్ధంలో 16 యుద్ధ విమానాలను కోల్పోయిన అమెరికా
ఇరాన్ దాడితో ఖతార్‌కు భారీ నష్టం.. ఎల్ఎన్‌జీ ఎగుమతులు ఐదేళ్లపాటూ బంద్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Revanth Reddy Assembly Speech | ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు అగ్రికల్చర్ సీలింగ్ చట్టం ద్వారా భూములకు విముక్తి కల్పించారు
- ●Disha Patani | నిన్న కృతి సనన్.. నేడు దిశా పటానీ.. బాలీవుడ్ హాట్ బ్యూటీపై ట్రోలింగ్..!
- ●UPI payments | ఎలాంటి విదేశీ ఒత్తిడీ లేదు.. యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం
- ●Indian Stock Market | రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●UPI | రూ.2వేలు దాటితే యూపీఐ ఛార్జ్.. క్రెడిట్ కార్డుతో పోలిస్తే ఎంత?
- ●Eatala Rajender | దాచేస్తే దాగేది కాదు తెలంగాణ చరిత్ర

Revanth Reddy Assembly Speech | ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు అగ్రికల్చర్ సీలింగ్ చట్టం ద్వారా భూములకు విముక్తి కల్పించారు

Disha Patani | నిన్న కృతి సనన్.. నేడు దిశా పటానీ.. బాలీవుడ్ హాట్ బ్యూటీపై ట్రోలింగ్..!

UPI payments | ఎలాంటి విదేశీ ఒత్తిడీ లేదు.. యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం

Indian Stock Market | రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..






