Qatars LNG Exports | ఇరాన్ దాడితో ఖతార్‌కు భారీ నష్టం.. ఎల్ఎన్‌జీ ఎగుమతులు ఐదేళ్లపాటూ బంద్
Qatars LNG Exports | ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ జరిపిన క్షిపణి దాడులతో ఖతార్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఖతార్‌లోని (Qatar) ప్రపంచంలోనే అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) ప్లాంట్ 'రాస్ లాఫాన్'పై (Ras Laffan) ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే.
International | Published On Mar 20, 2026, 9.56 am IST
Qatars LNG Exports | ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ జరిపిన క్షిపణి దాడులతో ఖతార్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఖతార్‌లోని (Qatar) ప్రపంచంలోనే అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) ప్లాంట్ 'రాస్ లాఫాన్'పై (Ras Laffan) ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడి కారణంగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎగుమతుల్లో దాదాపు 17 శాతం వరకూ ఉత్పత్తి చేసే కేంద్రాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఫలితంగా వార్షిక ఆదాయంలో సుమారు 20 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని ఖతార్ ఎనర్జీ సీఈవో, ఇంధన వ్యవహారాల రాష్ట్ర మంత్రి సాద్ అల్-కాబీ తెలిపారు.
అంతేకాదు, ఈ ప్లాంట్ మరమ్మతుల కోసం దాదాపు మూడు నుంచి ఐదేళ్ల సమయం పట్టొచ్చని పేర్కొన్నారు. ఈ మరమ్మతుల కారణంగా ఏడాదికి 12.8 మిలియన్ టన్నుల ఎల్ఎన్‌జీ ఉత్పత్తి ఐదేళ్లపాటూ నిలిచిపోతుందని (Qatars LNG Exports) వెల్లడించారు. ఫలితంగా ఈ ఐదేళ్లపాటూ ఎల్ఎన్‌జీ ఎగుమతులు నిలిచిపోనున్నట్లు తెలిపారు. "ఖతార్‌లో ఈ తరహా దాడులు జరుగుతాయని నేను కలలో కూడా ఊహించలేదు. ముఖ్యంగా సోదర ముస్లిం దేశం నుంచి రంజాన్ మాసంలో ఈ విధంగా మాపై దాడి జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు" అని అల్-కాబీ రాయిటర్స్‌తో పేర్కొన్నారు.
ఇక ఈ దాడి కారణంగా ఇటలీ, బెల్జియం, దక్షిణ కొరియా, చైనాలతో కుదుర్చుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఒప్పందాలపై ఐదేళ్ల వరకూ 'ఫోర్స్ మెజూర్' (Force Majeure) (అనివార్య కారణాల వల్ల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం) ప్రకటించాల్సి ఉంటుందని ప్రభుత్వ యాజమాన్యంలోని ఖతార్ ఎనర్జీ తెలిపింది. అంతేకాదు, ఈ ప్రభావం భారత్ సహా యూరోపియన్, ఆసియా దేశాలపై కూడా తీవ్రంగా పడనుంది. భారత్ తన సహజ వాయువు అవసరాల్లో సుమారు 20 శాతం ఖతార్ నుంచే దిగుమతి చేసుకుంటోంది.
Also Read..
అమెరికా ఎఫ్-35 ఫైటర్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తామే దాడిచేశామన్న ఐఆర్‌జీసీ
ఇరాన్ చమురు క్షేత్రాలపై దాడులు నిలిపేస్తాం: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
రహస్య కెమెరాలు.. 58 మంది మహిళలు: కీచక జ్యోతిష్యుడి చీకటి బాగోతం!
తాజావార్తలు
- ●Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి
- ●Fact Check | ఫ్యాక్ట్ చెక్.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్.. కేంద్రం క్లారిటీ..
- ●Telangana Employee JAC Meeting | ఉద్యోగ సంఘాల జేఏసీతో ఈ నెల 18న ప్రభుత్వ కీలక సమావేశం
- ●KCR | కేసీఆర్‌కు ఉన్నది 67 ఎకరాలు!
- ●Oil Palm Cultivation Telangana | ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణే టాప్
- ●Flipkart | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026.. అక్టోబర్ 9 నుంచి భారీ సేల్..

Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి

Fact Check | ఫ్యాక్ట్ చెక్.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్.. కేంద్రం క్లారిటీ..

Telangana Employee JAC Meeting | ఉద్యోగ సంఘాల జేఏసీతో ఈ నెల 18న ప్రభుత్వ కీలక సమావేశం

KCR | కేసీఆర్‌కు ఉన్నది 67 ఎకరాలు!






